Pawan Kalyan: పంచాయతీలకు స్వాతంత్ర్యదినోత్సవ బడ్జెట్ పెంపుపై పవన్ ట్వీట్...
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:32 PM
Andhrapradesh: ఏపీలో పంచాయతీలకు స్వాతంత్ర్య దినోత్సవం బడ్జెటన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 34 ఏళ్ల తర్వాత మైనర్, మేజర్ పంచాయతీలకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకల బడ్జెట్‌ను రూ.100, రూ.250 నుంచి రూ.10,000 మరియు 25,000కు పెంచారన్నారు.
అమరావతి, ఆగస్టు 12: ఏపీలో పంచాయతీలకు స్వాతంత్ర్య దినోత్సవం బడ్జెటన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deuty CM Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. 34 ఏళ్ల తర్వాత మైనర్, మేజర్ పంచాయతీలకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకల బడ్జెట్‌ను రూ.100, రూ.250 నుంచి రూ.10,000 మరియు 25,000కు పెంచారన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏపీలోని పంచాయతీలకు సాధికారత కల్పించేందుకు కీలక అడుగు పడిందన్నారు.
YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?
పంచాయత్ రాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చే దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం పంచాయితీలకు అధికారాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
Kangana Ranaut: నువ్వు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చుంటావు.. రాహుల్‌పై ఎంపీ కీలక వ్యాఖ్యలు
కాగా.. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు గతంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. పంచయాతీలకు స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్స వేడుకలను ఇచ్చే బడ్జెట్‌ను పెంచుతూ ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడానికి వీలుగా చిన్న పంచాయతీలు (మైనర్ పంచాయతీ)కు రూ.10 వేలు, మేజర్ పం చాయతీలకు రూ.25 వేలు నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐదు వేలు జనాభాలోపు ఉన్న పంచాయతీలను మైనర్ పంచాయతీలుగా, ఐదు వేలు జనాభా దాటిన పంచాయతీలను మేజర్ పంచాయతీలుగా పేర్కొంటున్నారు. ఈ నిధులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పంచాయతీ సర్పంచ్‌లు సగౌరవంగా జెండా వందనం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ నిధులతో గతంలో కన్నా ఎక్కువగానే స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవచ్చు. జాతీయతను ఉట్టి పడే విధంగా సమున్నతమైన కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం ఏర్పడు తుంది. స్వాతంత్య్ర పోరాట స్పూర్తిని ఇనుమడింప జేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను, స్వాతంత్య్ర సమర యోధులకు సత్కార కార్యక్రమాలను నిర్వ హించవచ్చు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వ హించడానికి సరిపడా నిధులను ప్రభుత్వం కేటా యించడంతో అన్ని రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: బంగ్లాదేశ్ పరిస్థితులపై పవన్ ట్వీట్... ఏమన్నారంటే?
YSRCP : టీడీపీ హయాంలోనూ వైసీపీ కాంట్రాక్టర్ దబాయింపులు.. ఎక్కడంటే?
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 12 , 2024 | 03:41 PM