Pawan Kalyan: కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
ABN, Publish Date - Dec 23 , 2024 | 08:56 AM
కృష్ణా జిల్లా: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించనున్నారు. వయా గొడవర్రు రోడ్డు పనుల పరిశీలించనున్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు.
కృష్ణా జిల్లా: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం కృష్ణా జిల్లా (Krishna Dist.)లో పర్యటించనున్నారు. (Visit) విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించనున్నారు. వయా గొడవర్రు రోడ్డు పనుల పరిశీలిస్తారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్య పాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంచాయతీ రాజ్, వాటర్ వర్క్స్ అధికారులతో సమస్యల గురించి చర్చిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసే దిశగా డిప్యూటీ సీఎం పర్యటిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు పనుల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటున్నారు.
రెండు రోజుల కిందటే ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం అయిన మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మౌళిక వసతులు లేక అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ఎన్నికల ప్రచార సమయంలో పరిశీలించిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఆయన గిరిజన గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జోరు వానలో సైతం పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగడం విశేషం.
కాగా రెండు రోజుల క్రితం (శుక్రవారం) పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.9 కోట్లతో బాగుజోల గ్రామ రహదారి పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి (Anantagiri) మండలం పినకోట పంచాయతీ బల్లగరువు (Ballagaruvu)లో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా బల్లగరువు గ్రామంలో 13 రహదారులకు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అంతకుముందు బల్లగరువు నుంచి కొండపైకి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు స్థానిక గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. వారితో సరదాగా ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలన్నీ త్వరలోనే తీర్చుతానని పవన్ హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా పవన్ పర్యటన కొనసాగించారు.
తమ గోడు వినేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వందల ఏళ్లుగా రోడ్లు, వైద్య, విద్య సదుపాయం లేక నానావస్థలు పడుతున్నామని, అలాంటిది ఇన్నాళ్లకు తమ సమస్యలు తీర్చేందుకు ఓ నాయకుడు వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. వారి సమస్యలు చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 23 , 2024 | 08:56 AM