AP BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. పొత్తులపై ఏం చర్చించారంటే...?
ABN, Publish Date - Mar 03 , 2024 | 08:58 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ బీజేపీ(BJP) పలు ప్రణాళికలను రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పలు కసరత్తులు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోడానికి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించింది.
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ బీజేపీ(BJP) పలు ప్రణాళికలను రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ పలు కసరత్తులు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోడానికి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తంగా 125 మందికి పైగా నేతలతో శివ ప్రకాష్ వరుస భేటీలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ బలాబలాపై సమీక్షించారు.
బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారనే అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. టీడీపీతో పొత్తులపై తమ అభిప్రాయాలను శివ ప్రకాష్‌కు ఏపీ నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.అధిష్ఠానమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని శివ ప్రకాష్ స్పష్టం చేశారు. రెండు రోజుల సమావేశం సారాంశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి శివ ప్రకాష్ నివేదించ నున్నారు. వారం రోజుల్లోగా టీడీపీ - జనసేనతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తులపై క్లారిటీ వస్తే రెండో విడత జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థుల పేర్లూ ఉండొచ్చని రాష్ట్ర కమలనాధుల అంచనా వేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 03 , 2024 | 08:58 PM