ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Durgamma Temple: దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్‌పై వేటు.. కారణమిదే

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:58 PM

Andhrapradesh: దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. మూలా నక్షత్రం రోజున వైసీపీ నేతకు రత్నారెడ్డి అంతరాలయం దర్శనం చేయించారు. అంతరాలయం ముందున్న గేటు తాళాలు తీసి మరీ వైసీపీ నేతకు దర్శనం చేసుకునేందుకు అనుమతిచ్చారు.

Vijayawada Kanakadurgamma

విజయవాడ, అక్టోబర్ 9: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్ర మూలానక్షత్రం కావడంతో ఈరోజు (బుధవారం) దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. సరస్వతీ దేవీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు గత రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. మూలానక్షత్రం కావడంతో ఈరోజు అంతరాలయం దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను బేకాతరు చేస్తూ ఓ వ్యక్తిని అంతరాలయం దర్శనానికి అనుమతించిన అధికారిపై వేటు పడింది.

Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..


దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. మూలా నక్షత్రం రోజున వైసీపీ నేతకు రత్నారెడ్డి అంతరాలయం దర్శనం చేయించారు. అంతరాలయం ముందున్న గేటు తాళాలు తీసి మరీ వైసీపీ నేతకు దర్శనం చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే సీనియర్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకున్నారు. రత్నారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు ఇచ్చారు. రత్నారెడ్డితో పాటు మరో ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సూపరింటెండెంట్ హయగ్రీవరావు, జూనియర్ అసిస్టెంట్ బలరాంపై అధికారులు వేటు వేశారు.


పట్టువస్త్రాల సమర్పణ..

కాగా... సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట నుంచి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం కల్పించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి మరీ భక్తులు బారులు తీరారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆపై సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.

TGSRTC: ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఛార్జీల పెంపు..


భారీగా ట్రాఫిక్ జామ్.. పట్టించుకోని పోలీసులు

మరోవైపు కనుక దుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలం అవుతున్న పరిస్థితి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కారణంగా దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాలు రాకపోకలు నిలుపుదల చేయడంతో వారధిపై రద్దీ పెరిగింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం..
YS Jagan: దుష్టసంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ జగన్ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 05:02 PM