ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amaravati: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

ABN, Publish Date - Jun 16 , 2024 | 07:26 AM

అమరావతి: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్ చేశారు. సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్టుపై ఆయన మరోసారి పోస్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

అమరావతి: మాజీ ఐఏఎస్ అధికారి (Ex IAS Officer) పీవీ రమేష్ (PV Ramesh) మరో సంచలన పోస్ట్ (Sensational post) చేశారు. సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్టు (Land Title Act)పై ఆయన మరోసారి పోస్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. గతంలో కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టా భూమిని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తహశీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతోపాటు ఆర్డీవో పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


చట్టం రాకముందే తన తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారంటూ అప్పట్లో పీవీ రమేష్ మండిడ్డారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అంటూ ఎమ్మెల్సీలు, ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఇంకా చెబుతుండడంపై పీవీ రమేష్ కౌంటర్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..

‘నేను ప్రత్యక్ష బాధితుడినే’


రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అసలు అవసరమే ఉండదు అంటూ ఆధారాలతో సహా పీవీ రమేష్ స్పష్టత ఇచ్చారు. నిజానికి నీతి అయోగ్ సలహా మండలి సెక్యూర్ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందని వెల్లడించారు. 200 సంవత్సరాల ముందు బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌కు రైత్వారి సెటిల్‌మెంట్ అప్పుడే జరిగిందన్నారు. రైతువారి సెటిల్‌మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుంచి సమర్థంగా పనిచేస్తుందని ఆయన తన పోస్టులో గుర్తుచేశారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత సర్కార్ ఈ చట్టాన్ని తెచ్చిందని తేల్చేసారు. అందుకే ఈ చట్టం ద్వారా తనతో పాటు సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని అప్పట్లో పోస్ట్ చేసినట్టు పీవీ రమేష్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అహంకారానికి దూరంగా.. బాధ్యతతో పనిచేద్దాం

అవి నా మనసుకు నచ్చిన శాఖలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 16 , 2024 | 09:26 AM

Advertising
Advertising