ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balakrishna: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:22 PM

Andhrapradesh: కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది.

MLA Balakrishna

విజయవాడ, సెప్టెంబర్ 12: కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ (MLA Balakrishna) అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అని అన్నారు. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారన్నారు.

Padi Koushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి.. హీటెక్కిన గ్రేటర్.. బ్రోకర్ అంటూ..


అందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లని గుర్తుచేశారు. వరద ముప్పుకు అందరూ స్పందించారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించి చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.

Maheshkumar: తెలంగాణలో ఉపఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు


కాగా.. వరద బాధితులకు బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన తమ వంతు సాయం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...
YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Read LatestAP NewsAnd Telugu News

Updated Date - Sep 12 , 2024 | 03:28 PM

Advertising
Advertising