ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఐదేళ్ల అవినాశనం.. 80వ దశకం చూపించారు

ABN, Publish Date - May 04 , 2024 | 01:00 AM

రక్తచరిత్ర మళ్లీ రాజ్యమేలుతోందా..? ఈ ఐదేళ్ల కాలంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన దాడులు, ఘర్షణలు, కొట్లాటలు, హత్యలు చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసుకుని ఈ ఐదేళ్లలో జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలోనైనా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై విరుచుకుపడినా.. పట్టాభిపై పగబట్టి ఇంటిని ధ్వంసంచేసినా.. చెన్నుపాటి గాంధీ కన్ను పొడిచేసినా.. ఇదేమని ప్రశ్నించిన మహిళల కళ్లలో కారం వేసి, రాళ్లతో కొట్టినా.. అన్నింటిలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌, ఆయన అనుచరులదే ప్రధాన పాత్ర అయినా.. పోలీసులు పట్టనట్టుగానే వ్యవహరించారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

  • బెజవాడకు మళ్లీ 80వ దశకం నాటి రక్తచరిత్ర

  • ఈ ఐదేళ్లలో పేట్రేగిపోయిన వైసీపీ రౌడీమూకలు

  • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి మొదలు

  • చెన్నుపాటి గాంధీపై దాడి.. కన్ను పోగొట్టారు

  • పట్టాభి ఇంట్లో రణరంగం.. తీవ్ర గాయాలు

  • పెన్షన్‌ కావాలన్న మహిళ కళ్లలో కారం వేసి, రాళ్లతో కొట్టి..

  • అన్నింటా దేవినేని అవినాశ్‌, అనుచరులదే ప్రధాన పాత్ర

  • పూర్తిగా సహకరించిన పోలీస్‌ యంత్రాంగం

  • 80వ దశకం నాటి పరిస్థితులు బెజవాడను మళ్లీ భయపెడుతున్నాయా..? కాలగర్భంలో కలిసిపోయిన రౌడీ

రక్తచరిత్ర మళ్లీ రాజ్యమేలుతోందా..? ఈ ఐదేళ్ల కాలంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన దాడులు, ఘర్షణలు, కొట్లాటలు, హత్యలు చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసుకుని ఈ ఐదేళ్లలో జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలోనైనా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై విరుచుకుపడినా.. పట్టాభిపై పగబట్టి ఇంటిని ధ్వంసంచేసినా.. చెన్నుపాటి గాంధీ కన్ను పొడిచేసినా.. ఇదేమని ప్రశ్నించిన మహిళల కళ్లలో కారం వేసి, రాళ్లతో కొట్టినా.. అన్నింటిలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌, ఆయన అనుచరులదే ప్రధాన పాత్ర అయినా.. పోలీసులు పట్టనట్టుగానే వ్యవహరించారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి


టీడీపీ నేత పట్టాభి ఇంటిపై..

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై 2021, ఫిబ్రవరి 2న దాడి జరిగింది. వైసీపీ మద్దతుదారులు ఐరన్‌ రాడ్లు, కర్రలు, రాళ్లతో గురునానక్‌ కాలనీలోని పట్టాభి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పట్టాభి తన కారులో ఇంటి నుంచి బయటకు రాగానే దాడి చేశారు. దాడిలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. అదే ఏడాది అక్టోబరు 19న మరోసారి పట్టాభి ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంట్లోకి చొరబడి భార్య, కూతురు సమక్షంలోనే సామానును ధ్వంసం చేసి సుమారు అరగంటపాటు వీరవిహారం చేశారు. పట్టాభి పదేళ్ల కూతురు ముందే దుండగులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో మరో 10 మందిని అరెస్టు చేశారు. వీరంతా కూడా దేవినేని అవినాశ్‌ అనుచరులే. వీరిలో బచ్చు మాధవి దేవినేని కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు.


టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021, అక్టోబరు 20న దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొంది విజయవాడకు చెందినవారే. 18వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ అరవ వెంకట సత్యనారాయణ అలియాస్‌ అరవ సత్యంతో పాటు వైసీపీ నాయకులు జోగరాజు (గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు డైరెక్టర్‌గా ఉన్నారు), బచ్చు మాధవి (దుర్గగుడి పాలకమండలి సభ్యురాలిగా ఉన్నారు) తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరంతా తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌కు అత్యంత సన్నిహితులు. వీరి ప్రమేయంపై అన్ని ఆధారాలు ఉన్నా, వారిని సైడ్‌ చేసి కేవలం కిందిస్థాయి కార్యకర్తలను బలి చేశారు.

దాడి చేసి.. కన్ను పొడిచేసి..

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై పటమటలంకలో 2022, సెప్టెంబరు 3వ తేదీ సాయంత్రం దాడి జరిగింది. పదునైన వస్తువుతో దాడి చేయడంతో ఆయన కుడికన్ను తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత కన్ను తొలగించారు. ఇంత జరిగినా నిందితులపై తూతూమంత్రంగా సెక్షన్లు 326, ఐపీసీ 506 కింద కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ నాయకుడు గద్దె కల్యాణ్‌ తదితరులు దాడి చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నా పోలీసులు నుంచి పెద్దగా స్పందన లేదు. గాంధీ, వైసీపీ నాయకుడి నడుమ పరస్పర దూషణలు జరిగి అనుకోకుండా దాడి చేశారని పోలీస్‌ కమిషనర్‌ రాణా అప్పట్లో చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది. వాస్తవానికి ఈ దాడిలో అవినాశ్‌ సన్నిహితుడు, వైసీపీ నాయకుడు గద్దె కల్యాణ్‌ ప్రధాన పాత్రధారి. స్కూటర్‌ తాళంతో గాంధీ కంట్లో పొడిచారు. ఈ దాడిలో గాంధీ కుడికన్నును కోల్పోయారు. రాజకీయ ఒత్తిళ్లతో నిందితులపై కేవలం బెయిల్‌బుల్‌ సెక్షన్లు నమోదు చేసి మమ.. అనిపించారు.


కళ్లల్లో కారం కొట్టి రాళ్లతో దాడి

17వ డివిజన్‌ తారకరామానగర్‌లో 2023, జనవరి 10న గడప గడపకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డితో పాటు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించడం లేదని, తనకు పింఛన్‌ రావడం లేదని షేక్‌ రమీజా అనే మహిళ వైసీపీ నాయకులను నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానిక మహిళ ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దీంతో అవినాశ్‌ అనుచరగణం రెచ్చిపోయింది. మరుసటి రోజు ప్రశ్నించిన మహిళ ఇంటిపైకి సుమారు 15 మంది వైసీపీ నాయకులు వెళ్లి దాడికి పాల్పడ్డారు. స్థానిక కార్పొరేటర్‌ రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ దామోదర్‌, చిన్నారి, మాధవి తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు. షేక్‌ రమీజా ఇంటిపై దాడి చేసి, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు కారం కళ్లలో చల్లి అమానుషంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల మహిళలు అడ్డు రాగా, వారిపై కూడా వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. ఇంత చేసినా బాధిత మహిళలను పోలీసుస్టేషన్‌కు పిలిచి సుమారు 10 గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు.

Updated Date - May 04 , 2024 | 12:17 PM

Advertising
Advertising