Perni nani: ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ షాకింగ్ నిర్ణయం
ABN, Publish Date - Nov 07 , 2024 | 04:41 PM
Andhrapradesh: రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనపడటం లేదని.. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదన్నాు. పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు వైసీపీ వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, నవంబర్ 7: ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni Nani) ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవన్నారు. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనపడటం లేదని.. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు వైసీపీ వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ అచేతనంగా తయారయిందని డిప్యూటీ సీఎం పవనే చెప్పారన్నారు. తాను చెప్పినా పని చేయటం లేదన్నారని తెలిపారు. రాజకీయ నాయకుల వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.
KTR: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర
ఇలాంటి స్థితిలో ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. డిప్యూటీ సీఎం స్వయంగా శాంతిభద్రతలు దిగజారాయని ఒప్పుకున్నారన్నారు. ఇలాంటి స్థితిలో ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామన్నారు. ‘‘మా సోషల్ మీడియా కార్యకర్తలకు 41ఏ నోటీసులు ఇచ్చి, మళ్ళీ వెనక్కు తీసుకుని అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ జెండా పట్టుకున్నా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసులు పెడితే కోర్టులో హాజరుపర్చడం లేదు. టీడీపీ నేతల ఇళ్లకు తీసుకుని వెళ్ళి కొడుతున్నారు ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ సమావేశాల్లో శాంతిభద్రతల గురించి ఒక్క మంత్రి కూడా మాట్లాడటం లేదన్నారు. కేవలం వైసీపీ నేతలను ఎలా ఇబ్బందులు పెట్టాలనే దానిపైనే చర్చ చేయటం సిగ్గుచేటన్నారు.
Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
అందుకే ఈ నిర్ణయం...
‘‘మా కార్యకర్తలను కనిపించకుండా తీసుకెళ్తున్నారు. దీనిపై మేము హెర్బియస్ కార్పస్ పిటిషన్లు మూవ్ చేస్తున్నాం. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవని పోలీసు అధికారులకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు. అందుకే నాలుగు జిల్లాల నాయకులు కూర్చుని బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నాం. ఏపీలో పాలనను గాలికి వదిలేశారు. వైసీపీ కార్యకర్తలు, నేతలను వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థను చేతగానితనంగా మార్చారు. పోలీసు వ్యవస్థ మొత్తం టీడీపీ నేతల గుప్పిట్లోకి వెళ్లి నిమ్మకు నీరెత్తినట్టుగా మారింది’’ అంటూ పేర్నినాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
AP News: ఎమ్మెల్యే మాధవి ఇష్యూ.. కడప మేయర్ ఏం చెప్పారంటే
Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్
Read Latest AP News And Telugu New
Updated Date - Nov 07 , 2024 | 04:46 PM