ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari: ఉదయం 7 నుంచి స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

ABN, Publish Date - Sep 12 , 2024 | 10:11 AM

Andhrapradesh: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది.

Godavari Flood

రాజమండ్రి, సెప్టెంబర్ 12: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్(Dhavaleshwaram Cotton Barrage) వద్ద గోదావరి (Godavari) వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అధికారులు సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Gold and Silver Rates: బంగారు ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..


గోదారమ్మ వరదతో రెండు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కాజ్ వేలు నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బోట్లలోనే ప్రయాణాలు సాగుతున్న పరిస్థితి. అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో రహదారులు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల్లో లక్షల ఎరరాల్లో పంటలు నీటమునిగాయి.

MLA Kaushik Reddy: కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..


కొనసాగుతున్న ఏలేరు వరద

ఏలేరు రిజర్వాయర్‌ నుంచి వరద జలాల విడుదల గణనీయంగా తగ్గించినా కాకినాడ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద, ఇతర ప్రధాన రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు బైపా్‌సరోడ్డు, పట్టణాల పరిధిలోని పంటపొలాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఏలేరు ప్రాజెక్టులో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఏలేరు కాల్వలకు నీటి విడుదల కూడా తగ్గించారు. అయినప్పటికీ ముంపు తగ్గలేదు. ఏలేరు ఆయకట్టుకు శివారు ప్రాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ముంపు ప్రభావం పెరిగింది. దీంతోపాటు కొత్తపల్లి మండలాన్ని కూడా వరద ముంచెత్తుతోంది.


ఇవి కూడా చదవండి...

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..


RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 12 , 2024 | 10:14 AM

Advertising
Advertising