Chandrababu: ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 రద్దుకు ప్రభుత్వ నిర్ణయం
ABN, Publish Date - Nov 06 , 2024 | 07:17 AM
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు (Land Grabbing Act) 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు గుర్తించింది. వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నట్టు తెలియవచ్చింది. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుచేత దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశముంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77 ను కూడా మంత్రివర్గం రద్దు చేయనుంది. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమికండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలియచేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చ జరగనుంది, ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్లకు పెంపుపైనా కేబినెట్ చర్చించనుంది. పరిశ్రమల రంగానికి సంబంధించి ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులపైనా మంత్రివర్గం చర్చించే అవకాశముంది.
కాగా రాష్ట్రంలో భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను అడ్డగోలుగా దురాక్రమణ చే సేవారికి 10 నుంచి 14 ఏళ్ల పాటు జైలుశిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకురానుంది. జైలుశిక్షతో పాటుగా కేసు తీవ్రతను అనుసరించి సదరు భూమి మార్కెట్ విలువ మొత్తాన్ని కూడా వసూలు చేసేలా కఠినమైన క్లాజులను ఆ చట్టంలో చేర్చనున్నారు. బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశం ఆమోదం కోసం ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్-2024’ ముసాయిదా ఫైలును రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక చట్టం-1982ను ఉపసంహరించుకోవాల్సి ఉంది. అంటే, ఇప్పుడున్న చట్టాన్ని అసెంబ్లీలో వెనక్కి తీసుకొని, కొత్త చట్టాన్ని ప్రతిపాదించి, సభలో ఆమోదించాలి. ఆ తర్వాతే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఇదంతా జరగాలంటే ప్రస్తుత చట్టం ఉపసంహరణకు, కొత్త చట్టం ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఈ అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు అజెండాలో చేర్చినట్లు తెలిసింది.
విలువైన భూములు స్వాహా
ప్రస్తుతం అమల్లో ఉన్న భూ ఆక్రమణల చట్టం-1982లో తీసుకొచ్చింది. గత 25ఏళ్లుగా ఈ చట్టం అమలు ఊసే లేదు. చట్టం అమలు కాకపోవడంతో దురాక్రమణదారులు రెచ్చిపోతున్నారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. వీరికి కొందరు రెవెన్యూ అధికారులు సహకరించి రాత్రికి రాత్రే భూ రికార్డులు మార్చేస్తున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతలు కూడా తోడవడంతో చట్టం అమలు చట్టుబండలైంది. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ భూముల రికార్డులను మార్చేసి అమ్ముకున్న ఉదంతాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు, కబ్జాకోరులు రెచ్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా విలువైన భూములను స్వాహా చేశారు. రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు అక్రమార్కులకు సహకరించి ప్రభుత్వ, అసైన్డ్, చుక్కల భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులు, కంపెనీలకు ఇచ్చిన భూముల రికార్డులను తారుమారు చేశారు.
కొత్త చట్టంపై రెవెన్యూ కసరత్తు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, అసైన్డ్ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు జూలైలోనే ప్రకటించారు. ఈమేరకు రెవెన్యూ శాఖ కొత్త చట్టం తయారీపై కసరత్తు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేస్తే 10నుంచి 14 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించడంతో పాటు కేసు తీవ్రతను జరిమానాను కూడా ప్రతిపాదించారు. కబ్జా చేసిన భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అసలైన యజమానులకు దక్కేలా చట్టపరమైన చర్యలు ప్రతిపాదించారు. రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన శిక్షలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇంకా ఏమైనా మార్పులు ప్రతిపాదిస్తారా? లేక దాన్నే యథాతథంగా ఆమోదిస్తారా?.. అన్న చర్చ జరుగుతోంది.
అక్రమ అధికారుల ఆస్తులు స్వాధీనం
కబ్జాకోరులకు సహకరించి, ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అధికారులపై కొత్త చట్టంలో కఠిన శిక్షలు ప్రతిపాదించారు. భూమి కబ్జాలో అధికారి పాత్ర ఉందని నిరూపితమైతే వారికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్షతోపాటు వారి ఆస్తుల స్వాధీనానికి కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గెలుపు దిశగా ట్రంప్.. ఆ రాష్ట్రాల్లో భారీ లీడ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 06 , 2024 | 07:17 AM