ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu Oath Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 8వేల మందితో పటిష్ఠ బందోబస్తు..

ABN, Publish Date - Jun 10 , 2024 | 03:44 PM

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ (Kesarapalli IT park) సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ (Kesarapalli IT park) సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.


దీనికి అనుగుణంగా కార్యక్రమానికి 8వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐజీ రవి ప్రకాశ్ తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సభా ప్రాంగణం చుట్టుపక్కల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సుమారు 30వరకు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నట్లు, స్థానికులు గమనించాలన్నారు.

ఎస్పీజీ అధికారుల సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లు, అతిథులు, వీఐపీలు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పటిష్ఠ బందోబస్తు నడుమ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు చేస్తున్నట్లు ఐజీ రవి ప్రకాశ్ వివరించారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 03:46 PM

Advertising
Advertising