ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు తేదీ ఖరారు..

ABN, Publish Date - Oct 15 , 2024 | 01:49 PM

Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి.

AP Liquor Policy

అమరావతి, అక్టోబర్ 15: ఏపీలో నూతన మద్యం పాలసీ (AP News Liquor Policy) తేదీ ఖరారైంది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం (AP Govt) మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్దతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..


ఇకపై రాష్ట్ర వ్యప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయనుంది ప్రభుత్వం. అన్ని షాపుల్లోనూ ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు మద్యం టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రతి మద్యం దుకాణంలోనూ ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. లాటరీ ప్రక్రియ విజయవంతం అయ్యింది. అలాగే టెండర్ల కోసం విదేశాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు గాను 89882 దరఖాస్తులు వచ్చాయి.

Anitha: అత్తా కోడళ్ళపై దారుణం.. 48 గంటల్లో నిందితుల అరెస్టు: హోంమంత్రి


మద్యం దరఖాస్తులపై మంత్రి కొల్లు ఏమన్నారంటే...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలోని 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించగా.. రికార్డుస్థాయిలో 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఒక్కో షాపునకు సగటున 25 మంది దరఖాస్తు చేశారని మంత్రి కొల్లు వెల్లడించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇవాళ (సోమవారం) లాటరీ నిర్వహించి మద్యం షాపులు కేటాయింటినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఈనెల 16 నుంచి నూతన మద్యం పాలసీ ద్వారా విక్రయాలు జరగనున్నట్లు వెల్లడించారు.

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..


"దరఖాస్తుల స్వీకరణ, మద్యం షాపుల కేటాయింపు సజావుగా జరిగింది. ఇకపై ఏపీలో మద్యం విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొత్త బ్రాండ్స్‌ను టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది. వైసీపీ హయాంలో ఇసుక, మద్యం విచ్చలవిడిగా అమ్మి జగన్ సొమ్ము చేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వకాలు చేయడం వల్ల అనేక కేసులు నమోదు అయ్యాయి. అసలు జగన్ సర్కార్‌లో ఎంత ఇసుక తీశారో, ఎంత మేర విక్రయాలు జరిగాయో లెక్కలే లేవు. వైసీపీ చేసిన ఇలాంటి పనుల వల్ల ప్రజలపై భారం పడింది. తాజాగా ఏపీలో108 ఇసుక రీచ్‌లు గుర్తించాం. ఈనెల 16న 40 రీచ్‌లను ఓపెన్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రెండు నెలల్లోపే ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుంది’’ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

AP Govt: ఏపీ మంత్రులకు జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలు

Jethwani Case: పోలీసు అధికారుల ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 01:53 PM