Potina Mahesh: బీసీల అభివృద్ధి అంటే ఆర్.కృష్ణయ్యకు ఎంపీ సీటు ఇవ్వడమా?..
ABN, Publish Date - Jan 06 , 2024 | 12:23 PM
Andhrapradesh: ఏపీలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఆర్.కృష్ణయ్య ఒక్కరికే ఎంపీ సీట్ ఇవ్వడమా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో ఎవ్వరు చేయనంత మోసం చేశారన్నారు. ఈ అంశం మీద ఆర్ కృష్ణయ్య తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
విజయవాడ, జనవరి 6: ఏపీలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) ఒక్కరికే ఎంపీ సీట్ ఇవ్వడమా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ (Janasena Leader Potina Venkata Mahesh) ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) చరిత్రలో ఎవ్వరూ చేయనంత మోసం చేశారన్నారు. ఈ అంశం మీద ఆర్ కృష్ణయ్య తమతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీసీల హృదయంలో జగన్మోహన్ రెడ్డికి స్థానం లేదనే ఆర్ కృష్ణయ్య.. జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారని విమర్శించారు.
బీసీలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఆరోపించారు. బీసీల ద్రోహి బీసీల వెన్నుపోటుదారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీసీలకు జగన్ మోహన్ రెడ్డి ఒక్క కొత్త పథకం కూడా ప్రవేశపెట్టలేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను రూ.75000 కోట్లు పక్కదారి పట్టించారని.. 56 బీసీ కార్పోరేషన్లకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. కృష్ణయ్య బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యమించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వంటి పెట్టుబడి పెత్తందారుల పల్లకి మోస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని పోతిన వెంకట మహేష్ హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 06 , 2024 | 12:23 PM