ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

ABN, Publish Date - Aug 07 , 2024 | 10:24 AM

Andhrapradesh: రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Jungle clearance work has started in Amaravati

అమరావతి, ఆగస్టు 7: రాజధాని అమ‌రావ‌తిలో (Capital Amaravati) జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్న మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిపే చోట, ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.

AP Assembly Speaker: స్పీకర్ అయ్యన్న పాత్రుడి నిరాడంబరత


కాగా.. గత ఐదేళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో జంగిల్ దట్టంగా పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించడంతో పాటు నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. రాజధానిని అభివృద్ధి చేయడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది.

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా



వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. సెక్రటేరియట్‌ వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులపై మంత్రి నారాయణ మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జంగిల్‌ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, రాజధాని క్యాపిటల్‌ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 10:26 AM

Advertising
Advertising
<