ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు.. ఎస్పీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:19 AM

Andhrapradesh: రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు.

Krishna District SP Gangadhar

విజయవాడ, డిసెంబర్ 23: మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perninani) కుటుంబంపై రేషన్ బియ్యం కేసు వ్యవహారంపై కృష్ణా ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పేర్నినానికి మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు. ఇప్పటికి ఒకేసారి నోటీసు ఇచ్చామని.. నోటీసులు ఆయన చూడలేదేమో మళ్ళీ నోటీసులు ఇస్తామని తెలిపారు. రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు. ఎవరికీ కేసు విచారణపై అపోహలు అవసరం లేదు అని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు.

కారు పార్టీలో ఆందోళన..


కాగా.. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం తీవ్ర సంచనాలకు దారి తీస్తోంది. కృష్ణా జిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం మిస్సింగ్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం హయాంలో పేర్నినాని సతీమణి పేరిట ఉన్న గోడౌన్ నుంచి పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బియ్యం మాయంపై పోలీసులు లోతైన విచారణ జరిపారు. అయితే గోడౌన్ పేర్నినాని భార్యపై ఉండటంతో ఆమెపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో వారిపై పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.


అయితే కొద్దిరోజుల క్రితమే అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన నాని ముందుస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టు, హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని జయసుధ అజ్ఞాతంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా విచారణకు సహకరించాల్సిందిగా నిన్న (ఆదివారం) పేర్నినాని కుటుంబానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులను అంటించారు. ఈకేసును ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న పేర్నినాని భార్యను పట్టుకోవడంతో కృష్ణా జిల్లా పోలీసులు విఫలమయ్యారనే వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 11:19 AM