ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు

ABN, Publish Date - Oct 11 , 2024 | 12:47 PM

ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 దరఖాస్తుల దాఖలు చేశారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రి వరకు గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

Wine Shops

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల కోసం గత అర్థరాత్రి వరకు 65,424 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఈ మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయని సమాచారం.

Also Read: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే


ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రితో గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. యూఎస్, యూరప్‌ నుంచి 20 దరఖాస్తులు అందాయని ఉన్నతాధికారులు వివరించారు.

Also Read: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం


రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ కీలక సూచనలు...

మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుదిగడువు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ కీలక సూచనలు చేశారు. సాయంత్రం 7 గంటల వరకే ఆన్‌లైన్‌లో నూతన రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించే వారు మాత్రం సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్‌లో ఉంటేనే అవకాశం కల్పిస్తామన్నారు. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటలలోపు ఎస్‌హేచ్‌ఓ‌లలో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించడం ద్వారా క్రమ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నిబంధనలు పాటించి సజావుగా ఈ కార్యక్రమం ముగిసేలా సహకరించాలని దరఖాస్తు దారులకు రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ నిషాంత్ కుమార్ సూచించారు.

Also Read: బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?


గురువారం అర్థరాత్రి వరకూ వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారీగా..

దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

తిరుపతి జిల్లాలో 227 షాపులకు 2589 ధరఖాస్తులు

శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాపులకు 1041 ధరఖాస్తులు

బాపట్ల జిల్లాలో 117 షాపులకు 1471 ధరఖాస్తులు

కాకినాడ జిల్లాలో 155 షాపులకు 2111 ధరఖాస్తులు

అన్నమయ్య జిల్లాలో 111 షాపులకు 1544 ధరఖాస్తులు

పల్నాడు జిల్లాలో 129 షాపులకు 1828 ధరఖాస్తులు

అనంతపురం జిల్లాల్లో 136 షాపులకు 1930 ధరఖాస్తులు

ప్రకాశం జిల్లాలో 171 షాపులకు 2478 ధరఖాస్తులు

శ్రీపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 182 షాపులకు 2828 ధరఖాస్తులు


నంద్యాల జిల్లాలో 105 షాపులకు 1652 ధరఖాస్తులు

కృష్ణా జిల్లాలో 123 షాపులకు 1888 ధరఖాస్తులు

చిత్తూరు జిల్లాలో 104 షాపులకు 1770 ధరఖాస్తులు

వైఎస్ఆర్ కడప జిల్లాలో 139 షాపులకు 2419 ధరఖాస్తులు

అనకాపల్లి జిల్లాలో 136 షాపులకు 2419 ధరఖాస్తులు

విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు 2841 ధరఖాస్తులు

పార్వతీపురం మన్యం జిల్లాలో 53 షాపులకు 1093 ధరఖాస్తులు

శ్రీకాకుళం జిల్లాలో 158 షాపులకు 3,427 ధరఖాస్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 869 ధరఖాస్తులు


తూర్పు గోదావరి జిల్లాలో 175 షాపులకు 3,889 ధరఖాస్తులు

బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133 షాపులకు 3,083 ధరఖాస్తులు

కర్నూలు జిల్లాలో 99 షాపులకు 2,405 ధరఖాస్తులు

గుంటూరు జిల్లాలో 127 షాపులకు 3,237 ధరఖాస్తులు

తూర్పుగోదావరి 125 షాపులకు 3,267 ధరఖాస్తులు

విజయనగరం 153 షాపులకు 4,110 ధరఖాస్తులు

ఏలూరు జిల్లాలో 144 షాపులకు 4,260 ధరఖాస్తులు

ఎన్టీఆర్ విజయవాడ 113 షాపులకు 4,819 ధరఖాస్తులు

యూఎస్, యూరప్ నుండి 20 ధరఖాస్తులు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 11 , 2024 | 01:17 PM