ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jethwani: జిత్వానీ కేసులో అనేక ములుపులు..

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:01 AM

అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు అనేక ములుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీయస్ అధికారులే కాదు... ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ పేరు బయటకొచ్చింది. ఉన్నతాధికారులు ఆదేశించడం..‌ చట్ట విరుద్దమైనా రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు..

అమరావతి: ముంబై నటి (Mumbai Actress) కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) కేసు (Case) అనేక ములుపులు తిరుగుతోంది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీయస్ అధికారులే (IPS Officers) కాదు... ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించిన ఒక మహిళా ఎస్ఐ (Female SI) పేరు బయటకొచ్చింది. ఉన్నతాధికారులు ఆదేశించడం..‌ చట్ట విరుద్దమైనా రెచ్చిపోవడం ఆ మహిళా ఎస్ఐ తీరు.. జిత్వానీ పొట్టలో కాలుతో బలంగా తన్నినట్లు సమాచారం. జత్వానీని ఇబ్బందులు పెట్టిన ఎస్ఐని‌ పోలీసు అధికారులు కాపాడుతున్నారు. అలాగే మహిళలపై దాడులు చేశారంటూ మరో వ్యక్తిపై గతంలో తప్పుడు కేసులు పెట్టినట్లు ఈ ఎస్ఐపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐపై బాధితులు భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ సబ్-ఇన్‌స్పెక్టర్‌పై దర్యాప్తునకు రాష్ట్రపతి ఆదేశించినా.. సిపి కాంతిరాణా తాతా ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. నటి జిత్వానీని కూడా ఈ మహిళ ఎస్.ఐ తీవ్రంగా కొట్టినట్లు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది.


కాగా ఐపీఎస్‌ అధికారులమనే విషయాన్ని మరిచి జగన్‌ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారుల పాపం పండింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిన ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై వేటు పడింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్‌ గున్నీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జెత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది.


మాజీ సీఎం జగన్‌ స్నేహితుడు సజ్జన్‌ జిందాల్‌పై కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్‌, కాంతిరాణా, విశాల్‌ గున్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేసి టార్చర్‌ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎస్‌లపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్టు ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాడలో అడ్డమైన పనులు చేయడం వరకు కాంతిరాణాపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్‌ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలు దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్‌ గున్నీ సొంతం.


ఐపీఎస్‌ అధికారులుగా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారు. జగన్‌ రెడ్డిని ప్రశ్నించిన ఎవరినైనా సరే ఏదో ఒక కేసు పెట్టి జైలులో తోయడం ఎలా అనే దానిపై మొత్తం పథక రచన చేసి, నాటి సీఎంతో అంజన్నా అని పిలిపించుకునేవారు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి వరకూ.. హైదరాబాద్‌లో రఘురామ రాజు నుంచి నంద్యాలలో చంద్రబాబు వరకూ ఎవరిని అక్రమంగా జైలుకు పంపాలన్నా ఆయనదే స్కెచ్‌ అన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యమే. జగన్‌ మెప్పు పొంది డీజీపీ అవ్వాలనే లక్ష్యంతో ఆయన చేసిన అరాచకాలు రాష్ట్ర చరిత్రలో ఏ ఐపీఎస్‌ అధికారి కూడా చేసి ఉండరు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ ఎయిర్‌పోర్టుకు మహర్దశ

విశాఖ సముద్ర తీరంలో తప్పిన ప్రమాదం..

అజ్ఞాతంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు?

విజయ్ చివరి చిత్రం రెమ్యూనరేషన్ ఎంతంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 16 , 2024 | 11:01 AM

Advertising
Advertising