ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Cabinet Swearing Ceremony: మెగాస్టార్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అద్భుత దృశ్యం..

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:51 PM

కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది.

MODI, Pawan, Chiranjeevi

కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.


ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. దీనిని మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 12 , 2024 | 01:23 PM

Advertising
Advertising