Anagani: ఫ్రీహోల్డ్ అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్ల నిలిపివేతకు కారణమిదే
ABN, Publish Date - Aug 13 , 2024 | 02:06 PM
Andhrapradesh: ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేసినట్లు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని మండిపడ్డారు.
అమరావతి, ఆగస్టు 13: ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలల పాటు నిలిపివేసినట్లు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని ఆరోపించారు.
Purandeshwari: ఏపీలో తిరంగా యాత్ర.. ప్రారంభించిన పురందేశ్వరి
నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని తెలిపారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kolkata Doctor case: కోల్‌కతా వైద్యురాలి మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయం..
20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముందన్నారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేసేందుకే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
Drugs Case: గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం...
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ అనకొండ ధాటికి కంచె ఎలా కూలిందో చూడండి.. వీడియో వైరల్!
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 13 , 2024 | 02:06 PM