Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:24 PM
Andhrapradesh: జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మంత్రి డోలా ఆంజనేయులు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను నమ్ముకుని చాలా మంది వలంటరీ ఉద్యోగాలకు వచ్చారన్నారు. ఆగస్టు 2023 నుంచి వలంటీర్లను ఎక్కడ రెన్యూవల్ చేయలేదని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 19: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan) మంత్రి డోలా ఆంజనేయులు (Minister Dola Anjaneyulu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు.
YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!
జగన్‌ను నమ్ముకుని చాలా మంది వలంటరీ ఉద్యోగాలకు వచ్చారన్నారు. ఆగస్టు 2023 నుంచి వలంటీర్లను ఎక్కడ రెన్యూవల్ చేయలేదని తెలిపారు. ఉద్యోగాలు లేని వారిని మోసపు మాటలు చెప్పి వారి జీవితాలను అగమ్య గోచరంగా మార్చారని మండిపడ్డారు. సలహాదారుల పోస్టులు మాత్రం పదవీకాలం ముగియకముందే వారిని రెన్యువల్ చేశారన్నారు. పనికిమాలిన వ్యక్తులను సలహాదారులుగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
HYDRA: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్‌సాగర్‌లో నిర్మాణాలేనా..
గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా దోచి పెట్టారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలపై అధికారుల తెలిపిన విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. పనిచేసే ప్రభుత్వంపై బురద చల్లొద్దు అని అన్నారు. తిరుమలలో జరిగిన దోపిడీలపై సమగ్రమైన విచారణ జరిపి తీరుతామని మంత్రి డోలా ఆంజనేయులు స్పష్టం చేశారు.
ఏపీ కేబినెట్‌లో చర్చ
వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై నిన్న(బుధవారం) జరిగిన ఏపీ కేబినెట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: నేడు ఏయే శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారంటే..
Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 19 , 2024 | 12:24 PM