Dola Veeranjaneya Swami: నవగ్రహాలు దాటించి మరీ తరిమికొట్టారు.. జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్
ABN, Publish Date - Oct 03 , 2024 | 04:42 PM
Andhrapradesh: జగన్ ఖాళీగా కూర్చోలేక ప్రభుత్వంపై కాలుష్యం చిమ్ముతున్నారు. అన్న క్యాంటీన్ రద్దు చేసి పేదల నోటి కాడి కూడు లాగేసిన జగన్.. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారనటం సిగ్గుచేటు. ఐదేళ్లలో బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చినదాని కంటే జగన్ బొక్కిందే ఎక్కువని మంత్రి డోలా విమర్శించారు.
అమరావతి, అక్టోబర్ 3: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Sri Bala Veeranjaneya Swami) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఖాళీగా కూర్చోలేక ప్రభుత్వంపై కాలుష్యం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్ రద్దు చేసి పేదల నోటి కాడి కూడు లాగేసిన జగన్.. చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారనటం సిగ్గుచేటన్నారు. ఐదేళ్లలో బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చినదాని కంటే జగన్ బొక్కిందే ఎక్కువని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేయబట్టే.. ప్రజలు మిమ్మల్ని నవగ్రహాలు దాటించి తరిమికొట్టారంటూ వ్యాఖ్యలు చేశారు.
Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. జగన్ లాగా తాము ప్రజలను మోసం చేయమని.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి వైసీపీకి సూపర్ స్ట్రోక్ ఇస్తామని స్పష్టం చేశారు. కేసుల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పాపంగా ప్రజల నుంచి ప్రతిపక్షాల వరకు గత ఐదేళ్ళలో వేలాదిగా అక్రమ కేసులు మోపింది ఎవరు అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక రద్దు చేసి ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టింది జగనే అని... తాము ఉచిత ఇసుక ఇస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయం.. ధర్మం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడుతున్నాయంటూ మంత్రి డోలా శ్రీబాల వీరాంజేయస్వామి వ్యాఖ్యలు చేశారు.
పిచ్చిపట్టినట్టుగా జగన్ వ్యవహార శైలి: మంత్రి అనగాని
అధికారం లేక పిచ్చిపట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. గత అరాచక ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారని తెలిపారు. నాసిరకం మద్యం తాగించి వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచిన జగన్ రెడ్డి... మద్య నియంత్రణపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
జగన్ రెడ్డి తానిచ్చిన హామీల్లో కేవలం 12 శాతం మాత్రమే అమలు చేశారన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన 150 పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఐదు హామీలను నేరవేర్చిందన్నారు. జగన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఇచ్చినప్పటికీ వీలైనంత త్వరగా ఇచ్చిన వాగ్ధాలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడంతో పాటు ఒకటో తేదీనే ఇస్తుండడంతో అవ్వాతాతలందూ చంద్రబాబే తమ పెద్ద కొడుకని ఆనందంలో ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Pattabhiram: టీటీడీ లడ్డూ వివాదం... ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి...
BTech Ravi: ఎంపీ అవినాష్ వ్యాఖ్యలను ఖండించిన బీటెక్ రవి
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 03 , 2024 | 04:51 PM