ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:55 AM

Andhrapradesh: ‘‘నీకు నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి’’ అని మంత్రి కొల్లురవీంద్ర ప్రశ్నించారు.

Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, సెప్టెంబర్ 28: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Former CM YS Jagan) తిరుపతి పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. ‘‘నీకు నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి’’ అని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుపతిని అపవిత్రమైందన్నారు. చాలా మంది ప్రజలు తిరుపతి వెళ్లలేదని తెలిపారు. మంచి ప్రభుత్వం వచ్చాక వేల మంది, లక్షల మంది తిరుపతికి పాదయాత్రగా వెళుతున్నారని అన్నారు.

Pawan Kalyan: ఆ అవసరం ప్రకాశ్ రాజ్‌కు లేదు.. పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..


నోటీసులపై..

సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వాళ్లే డిక్లరేషన్ మీద సంతకం చేసి కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. తిరుపతి వెళ్లకుండా నోటీసులు ఇచ్చారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. ఏ ఒక్కరికీ పోలీసులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలగకుండా జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జగన్ తీరు వల్ల నేడు అనేక హిందూ సంఘాలు ఆందోళనతో ఉన్నాయన్నారు.

Janimaster: నా భర్తను ట్రాప్ చేసింది.. నరకం అంటే ఏంటో చూశా.. జానీ మాస్టర్ భార్య



పేర్నినాని వ్యాఖ్యలపై..

పేర్ని నాని వ్యాఖ్యలపై కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. హింసా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదన్నారు. ‘‘ఐదేళ్లలో నువ్వు, నీ కొడుకు చేసింది ఏమిటి. టీడీపీ, జనసేన నేతల ఇళ్లపై దాడులు చేయలేదా.. నాపై హత్యా నేరం మోపి 54 రోజులు జైలులో పెట్టలేదా.. బందరు పోర్టు, మెడికల్ కాలేజీ ఎవరికి అమ్మకం పెట్టారో చెప్పండి. ఇళ్ల స్థలాల పేరుతో పేదల భూములు కబ్జా చేసిన వ్యక్తి పేర్ని నాని. ఆయన అవినీతిపై విచారణ జరుగుతుంది, త్వరలోనే బహిర్గతం చేస్తాం’’ అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Buddha Venkanna: నిన్ను ఆపింది ఆ శ్రీవారే.. జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 12:25 PM