AP News: టెస్లా కేంద్ర కార్యాలయ సందర్శన కోసం ఆస్టిన్ చేరిన మంత్రి లోకేష్
ABN, Publish Date - Oct 28 , 2024 | 07:45 AM
ఏపీ యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అమరావతి/అమెరికా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) అమెరికాలో పర్యటిస్తున్నారు. (America Visit) ఈ సందర్భంగా టెస్లా కేంద్ర కార్యాలయ (Tesla Teadquarters) సందర్శన కోసం ఆయన ఆస్టిన్ (Austin) చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో లోకేష్‌కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా ఎలాన్ మస్క్ సూపర్ కార్ టెస్లా ఎప్పుడెప్పుడు ఇండియా రోడ్లపై పరుగులు తీస్తుందా అని చాలా మంది ఇండియన్స్ ఎదురు చూస్తున్నారు. టెస్లా కంపెనీని ఇండియాకు తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ కంపెనీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తీవ్రంగా ప్రయత్నించారు.
ఆ ప్రయత్నాలు ఫలించే సమయంలో జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆయన హయాంలో ఉన్న కంపెనీలు పారిపోయే పరిస్థితి వచ్చింది. టెస్లా కోసం ప్రయత్నించిన వాళ్లే లేరు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో టెస్లా కంపెనీ మీద ఏపీ ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఇదే ప్రశ్నను నేషనల్ ఇండియా మీడియా మంత్రి లోకేష్‌ను అడిగినప్పుడు టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే కృషి కొనసాగుతుందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంవల్ల ఏపీకి రావడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా టెస్లా కార్ల కంపెనీ అనంతపురంలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు కియా ఒక ఉదాహరణ అని, ఏపీలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందన్నారు. ‘కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలకా్ట్రనిక్స్ హబ్‌లుగా తయారుచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 25శాతం సెల్‌ఫోన్లు, 50శాతం ఏసీలు ఏపీలోనే తయారవుతున్నాయి’ అని తెలిపారు. కృష్ణా, గుంటూరు కేపిటల్ రీజియన్‌లో 5బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని వెల్లడించారు. డిసెంబరు నుంచి అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టి సారించామని చెప్పారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రానుందని, టీసీఎస్ కూడా త్వరలో కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు. ‘ఎలకా్ట్రనిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఏపీ కీలకపాత్ర పోషించనుంది. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని విజ్ఞప్తి చేశారు.
ఈక్వెనెక్స్ డేటా సెంటర్ సందర్శన
శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. తమ సంస్థ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆహ్వానించారు. సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ ఎం.ఆర్. రంగస్వామి, ఫాల్కన్ ఎక్స్ కోఫౌండర్ రాజు ఇందుకూరి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, ఏ5 కార్పొరేషన్ సీఈవో వినయ్ కృతివెంటి, అప్లైడ్ మెటీరియల్స్ సీటీవో ఓం నలమాసు, డేటా సెంటర్ సీఈవో కల్యాణ్ ముప్పనేని, గ్లోబల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సీఈవో రాంరెడ్డి, సిలికానాంధ్ర ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల తదితర 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
అభిమానుల తాకిడి
పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన మంత్రి లోకేశ్‌కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్‌ఫ్రాన్సిసోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూనే మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపరచకుండా వారితో ఆయన ఫొటోలు దిగారు. కాగా, రెండోరోజు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై పెట్టుబడులు పెట్టాలని కోరారు. గూగుల్ సీటీవో ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సీఈవో డాక్టర్ వివేక్‌లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండీ నీరజ్ అరోరా, ఐస్పేస్ ప్రెసిడెంట్ రాజేశ్ కొత్తపల్లి, సీఎ్‌ఫవో ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 28 , 2024 | 07:45 AM