Lokesh: విరాళాల వెల్లువ... దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 03:38 PM
Andhrapradesh: భారీ వరదలు విజయవాడకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది మంది తమ సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లన్నీ బురదమయమవడమే కాకుండా.. ఇంట్లోని సామన్లు కూడా పనికిరాకుండా పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 7: భారీ వరదలు విజయవాడకు (Vijayawada) తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది మంది తమ సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లన్నీ బురదమయమవడమే కాకుండా.. ఇంట్లోని సామన్లు కూడా పనికిరాకుండా పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. వరద బాధితులకు సాయం అందించేందుకు దాతల నుంచి విరాళాల వెల్లువలా వస్తున్నారు.
Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
పలువురు ప్రముఖులు.. మంత్రి లోకేష్‌ను (Minster lokesh) కలిసి చెక్కులను అందజేశారు. దాచేపల్లి లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ అధినేత కామాటి వరలక్ష్మి రూ. 5 లక్షలు, వల్లభనేని గిరిబాబు రూ.5 లక్షలు అందజేశారు. మంత్రి ఫరూక్ చేతుల మీదుగా నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముడియం కొండారెడ్డి రూ.61 వేలు, ఎలిశెట్టి హరనాథ్ రూ.30 వేలు అందజేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి నాగశ్రవణ్ రూ. 5 లక్షలు, దుగ్గిరాల నీలంపాటి అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ అధినేత ఎండ్రాటి యజ్ఞతేజ రూ. 2 లక్షలు, విజయవాడకు చెందిన మార్పులు సత్యానందం గురువు రూ. 10వేలు విరాళంగా అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం పిలుపుతో..
మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, ఎన్నారైలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు తమ విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం సహాయనిధికి కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కె.వి.రావు రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. అలాగే ఏఎంగ్రీన్-గ్రీన్‍కో సంస్థ రూ.5 కోట్లు ఇచ్చింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు కోటిన్నర ఇచ్చాయి. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి మోహిత్ మినరల్స్ సంస్థ రూ.50 లక్షలు ఇచ్చింది.
కల్యాణ్ ఆక్వా అధినేత రాజేంద్రబాబు రూ.10 లక్షలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య సీఎం సహాయనిధికి రూ.10 లక్షలు ఇచ్చింది. కోటపాటి జనార్దన్ రావు రూ.10 లక్షలు ఇచ్చారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ10 లక్షల విరాళం ఇచ్చారు. భూమా-శోభానాగిరెడ్డి ట్రస్ట్ తరఫున విరాళం అందించడం జరిగింది. అలాగే విజయవాడలో వెయ్యి కుటుంబాలకు అఖిలప్రియ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయార్థం మంత్రి లోకేష్‌కు సైతం పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందజేస్తున్నారు. భూపతిరాజు సీతాదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం.. ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అమ్మన్న రూ.5లక్షల విరాళం అందజేశారు. విజయవాడ హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ యజమాని ఎస్‌వీఎస్ శెట్టి రూ.1,71,272 విరాళం అందజేశారు. మండవ వెంకట సూర్యప్రతాప్, నాగశ్వేత దంపతులు రూ.50వేలు, కోనేరు అనిల్ కుమార్ రూ.50వేలు అందజేశారు.
Apple Watch: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ 10.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
ముమ్మరంగా వరద సహాయ చర్యలు
కాగా.. మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద బాధితులకు సహాయ చర్యలపై మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎన్ఎండి ఫరూక్‌లతో మంత్రి లోకేష్ సమీక్షించారు. పండుగ రోజు కూడా ముంపు ప్రాంతాల్లో వరద బాధితులకు ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతున్నారు. అలాగే బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో రేయింబవళ్లు శ్రమించి ఎట్టకేలకు గండ్ల పూడ్చివేత కార్యక్రమం ముగిసింది. గండ్ల పూడ్చివేతలో పాలుపంచుకున్న అధికార యంత్రాంగం, కార్మికులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Pawan: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి అందించిన డిప్యూటీ సీఎం
Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే..
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 07 , 2024 | 03:47 PM