Lokesh: అమెరికాలోని ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
ABN, Publish Date - Oct 27 , 2024 | 07:59 AM
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో పారిశ్రామిక పాలసీలు.. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని పారిశ్రామిక వేత్తలకు మంత్రి లోకేష్ తెలిపారు. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని... $5 బిలియన్లతో క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి జరుగుతుందని, ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో యావియేషన్ వర్సిటీ, డాటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అమరావతి/అమెరికా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) అమెరికాలో పర్యటిస్తున్నారు. (America Visit) ఈ సందర్భంగా ఈక్వెనెక్స్ డాటా (Equinex Data) సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)లోని ప్రపంచ ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డాటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌కు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డాటాసెంటర్ల నెట్ వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి లోకేష్ వారికి వివరించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో పారిశ్రామిక పాలసీలు.. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని... $5 బిలియన్లతో క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి జరుగుతుందని, ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో యావియేషన్ వర్సిటీ, డాటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కాగా శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. అక్కడ పారిశ్రామికవేత్తతతో సమావేశం అయ్యారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్‌లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి, పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషిచేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఏపీలో ఎన్డీఏ కూటమి ‘‘అఖండ’’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా అమెరికాలో లోకేష్ పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు మంత్రి లోకేష్ హాజరవుతారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఎన్నారై టీడీపీ నేతలు, టీడీపీ అభిమానులు, ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరవుతారని టీడీపీ ఎన్నారై నాయకులు తెలిపారు. ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇన్ చార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీష్ మండువ, సురేష్ మానుకొండ మంత్రి లోకేష్ కు విమానశ్రయంలో ఘన స్వాగతం పలికారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏపీలో ఉన్న పలువురు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతలు అమెరికా విచ్చేశారని టీడీపీ ఎన్నారై విభాగం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 27 , 2024 | 10:02 AM