Lokesh: లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్.. త్వరలోనే ఏపీకి దిగ్గజ కంపెనీలు
ABN, Publish Date - Nov 02 , 2024 | 09:44 AM
Andhrapradesh: అమెరికాలో లోకేష్ బిజీబిజీగా గడిపారు. దిగ్గజ కంపెనీలతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశం అంటూ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ క్రమంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు వస్తే రాష్ట్రంలో చాలా మంది ఉపాధి లభించే అవకాశం ఉంది.
అమరావతి, నవంబర్ 2: రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా అమెరికాలో మంత్రి పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) విజన్‌ను ఆవిష్కరించారు.
Nara Lokesh : రెడ్‌బుక్ చాప్టర్-3 తెరుస్తాం
ఐదేళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగింది. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. లోకేష్ భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. లోకేష్ పర్యటన విజయవంతంపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికాలో లోకేష్ బిజీబిజీగా గడిపారు. దిగ్గజ కంపెనీలతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశం అంటూ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ క్రమంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు వస్తే రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జగన్ హయాంలో ఎక్కడా కూడా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. అయితే జగన్ అమెరికా వెళ్లినా, ఢిల్లీకి వెళ్లినా స్వప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోంచించిన పరిస్థితి లేదు. గత ఐదేళ్లలో పెట్టుబడుల ఊసే లేని నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగింది. ప్రముఖ దిగ్గజ కంపెనీల అధిపతులతో విస్తృతంగా చర్చించారు.
ఏపీలో ఏఏ రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉందో వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ పునరుద్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ కార్లు, రియల్‌ఎస్టేట్ రంగంలోని ప్రముఖులతో సంప్రదింపులు జరిపి అమరావతి మొదలుకుని ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా రంగాల్లో అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆయన పర్యటనలో సీఎంవో సంయుక్త కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా పాల్గొన్నారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన లోకేష్ మర్నాటి నుంచి వరుసగా వారం రోజుల పాటు అనేక సంస్థల సీఈవోలు, అధినేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో తన పర్యటనను ముగించుకున్న లోకేష్ భారత కాలమానం ప్రకారం ఈరోజు (శనివారం) ఉదయం స్వదేశానికి బయలుదేరుతారు. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 09:53 AM