Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:11 PM
Andhrapradesh: రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 16: బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ (YSRCP) అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు.
PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..
వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్‌ను కూడా డిజైన్ చేయటం జరుగుతుందన్నారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్‌కు పంపించటం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్టను నాలుగులైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు.
World Record: డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచరికార్డ్..
రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80 శాతం పూర్తి చేయటం జరిగిందని చెప్పారు. రైతులకు కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేయటం జరిగిందని.. ల్యాండ్ పూలింగ్‌పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారన్నారు. వాటిపై క్లారిటీ వస్తే భూములు ఇవ్వటానికి ముందుకి వస్తామని రైతులు మాట్లాడారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Tirumal: తిరుమల్లో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు
Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
Read LatestAP NewsANDTelugu News
Updated Date - Sep 16 , 2024 | 03:11 PM