ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

ABN, Publish Date - Sep 12 , 2024 | 02:58 PM

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు.

Minister Nimmala Ramanaidu

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 12: ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minster Nimmala Ramanaidu) తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు. బోట్లకు మూడు లేయర్స్ ఉన్న కారణంగా కట్ చేయడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు.

YSRCP: ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం.. జనసేనలోకి కీలకనేత..


కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని తీసుకొస్తున్నామని తెలిపారు. సాయంత్రం నుంచి ఆయన కూడా తనదైన మార్గంలో బోట్లు తొలగింపు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. లోకల్‌గా ఉన్న బోట్స్‌ను కూడా ఉపయోగించి బోట్స్‌ను తొలగింపు కార్యక్రమం చేపడతామన్నారు. సాయంత్రానికి ఒక బోటు తొలగింపుపై ఒక స్పష్టత వచ్చిందని.. ఇప్పుడు కొట్టుకొచ్చిన బోట్స్ గతంలో కొట్టుకొచ్చిన బోటు కంటే రెండింతలు ఎక్కువగా ఉందని తెలిపారు. స్కూబా డైవర్స్ 24 గంటలు కష్టపడి అండర్ వాటర్‌లో కటింగ్ చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఈరోజు సాయంత్రానికి

కాగా... ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండడంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు నాలుగు ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్‌ అయిన.. క్రేన్ల సాయంతో పైకి తీసే ప్రయత్నం విఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు.


చివరికి నాలుగో ప్లాన్‌గా ఉన్న అండర్‌ వాటర్‌ ఆపరేషన్‌ మేలు అనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్లాన్ అమలుకు గాననూ.. విశాఖపట్నం నుంచి సీ లయన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి నిపుణులను రప్పించారు. కంపెనీ ప్రతినిధి సూర్య అక్షిత్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది డైవర్లు బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బోట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి బెకమ్‌ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కులను సీ లయన్‌ చేస్తుంటుంది కాబట్టి అండర్ వాటర్ ఆపరేషన్‌ను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన నిపుణులు ముందుగా బోట్ల వద్ద సర్వే చేశారు.


అనంతరం ఇద్దరు డైవర్లు ఆక్సిజన్‌ సిలిండర్లతో నీళ్లలోకి దిగి బోట్ల కింది భాగంలో పరిస్థితిని అంచనా వేశారు. బ్యారేజీ 67వ నంబరు గేటు దగ్గర రెండు బోట్లు పైకి కనిపిస్తున్నాయి. ఈ రెండింటికీ అడుగు భాగాన మరో బోటు ఉందని సీ లయన్‌ డైవర్లు గుర్తించారు. డైవర్లు.. నీళ్లలో 10 నుంచి 12 అడుగుల లోతుకి వెళ్లడంతో బోటును గుర్తించారు. అనంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీళ్లలో సర్వే చేసి ఆపై ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఒక్కో బోటు కటింగ్‌ పూర్తికావడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...
Godavari: ఉదయం 7 నుంచి స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 12 , 2024 | 03:32 PM

Advertising
Advertising