ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chitamaneni: నన్ను వేధించివారికి అందలమా.. సొంత నేతలపై చింతమనేని సెటైర్లు

ABN, Publish Date - Nov 15 , 2024 | 11:27 AM

Andhrapradesh: వైసీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేనిపై 27 అక్రమ కేసులు నమోదు అవగా.. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. తన కోడలి రాజకీయ జీవితంపైనా పల్లె రఘునాథ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

MLA Chintamaneni Prabhakar

అమరావతి, నవంబర్ 15: ఏపీ అసెంబ్లీ లాబీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (MLA Chintamaneni Prabhakar), మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (Former Minister Palle Raghunath Reddy) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో వారిపై నమోదు అయిన అక్రమ కేసులకు సంబంధించి మీడియాకు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగడాలను గుర్తుచేశారు. వైసీపీ పాలనలో చట్టాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమపై కేసు పెట్టి అధికారులంతా ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. కాగా.. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేనిపై 27 అక్రమ కేసులు నమోదు అవగా.. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. తన కోడలి రాజకీయ జీవితంపైనా పల్లె రఘునాథ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

YSRCP: అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పా.. వైసీపీ వింత ప్రవర్తన


నన్ను వేధించిన అధికారులే..: చింతమనేని

ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో తనపై వైసీసీ ప్రభుత్వం 27 అక్రమ కేసులు పెట్టిందన్నారు. నిన్న రెండు కేసులను న్యాయస్థానం తప్పని కొట్టేసిందన్నారు. మరో 25 అక్రమ కేసులు తనపై ఉన్నాయన్నారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టిన అధికారులంతా ఎక్కడెక్కడో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల విలువ తీసేసేలా అక్రమ కేసులతో చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నిన్న తనపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే అని తెలిపారు. కేసులో బాధితులుగా తనతో పాటు ఎస్సీలూ ఉండటం గమనార్హమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.


కోడలి గురించి గొప్పగా చెప్పిన పల్లె...

‘‘నా పైన 14 అక్రమ కేసులు పెట్టారు. పుట్టపర్తిలో నారా లోకేష్ పర్యటన విజయవంతమైందని నాపై కేసులు పెట్టారు’’ అని మాజీ మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి తెలిపారు. అలాగే కోడలు సింధూరు గురించి కూడా పల్లె ఆసక్తికర విషయాలు తెలియజేశారు. గురువు విద్యార్థిని తీర్చిదిద్దినట్లు కోడల్ని రాజకీయాల్లో తీర్చిదిద్దుతారుగా అని పల్లెతో ఈ సందర్భంగా చింతమనేని అన్నారు. దీనిపై పల్లె మాట్లాడుతూ.. కోడలు సింధూర కేరళ మాజీ డీజీపీ కుమార్తెతో పాటు ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ చదివారని తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు ఇలా మొత్తం ఎనిమిది భాషలు సింధూరకు వచ్చని పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 11:28 AM