ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nandamuri Balakrishna: సోదరికి బాలయ్య ఆత్మీయ పలకరింపు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:15 PM

ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది.

Balakrishna and Bhuwaneswari

ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు నాయుడు సతీమణి, బాకలృష్ణ సోదరి భువనేశ్వరి ఉన్నారు. ఆమెను చూసిన వెంటనే బాలకృష్ణ.. భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. భువనేశ్వరిని ఆ వేదికపై చూసి ఎమోషనల్ అయిన బాలకృష్ణ.. సోదరుడిగా నుదుటిపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ తన సోదరిని చూసి ఎమోషనల్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.


గత రెండేళ్లుగా ఇబ్బందులు..

వైసీపీ నాయకులు గత ఐదేళ్లుగా రాజకీయంగా చంద్రబాబు నాయుడును విమర్శించడమే కాకుండా.. కొంతకాలంగా ఆయన సతీమణి భువనేశ్వరిపైనా అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చేలా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తూ వచ్చారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆ సమయంలో భువనేశ్వరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో వైసీపీ అరాచక పాలన పోయి.. ప్రజాపాలన రాష్ట్రంలో రావడంతో బాలకృష్ణ ఎమోషనల్ అయి తన సోదరిని ఈ విధంగా ఆత్మీయంగా పలకరించారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 12 , 2024 | 02:16 PM

Advertising
Advertising