ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థతో చేరి దేశంలోనే అతిపెద్ద స్కాం చేస్తోంది.. ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:23 PM

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పనంగా ఆస్తులు కట్టబెడుతోందని బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆరోపించారు.

అమరావతి: శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పనంగా ఆస్తులు కట్టబెడుతోందని బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆరోపించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోందన్నారు. ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. బడాబాబులకు దోచిపెడుతూ.. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రూ.లక్ష మూలధనం ఉన్న ఇండోసోల్‌ కంపెనీకి.. నిబంధనలు అతిక్రమించి ఖరీదైన 11 క్యార్ట్జ్‌ గనులు కట్టబెట్టడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. ఆ సంస్థ వ్యవహారం మొత్తం అతి పెద్ద వాల్యూషన్‌ గేమ్ అని ఆరోపించారు. పేదల ప్రభుత్వం అని చెబుతూ.. పెత్తందారులు నడిపే కంపెనీలకు ప్రకృతి వనరులు కట్టబెట్టడం, రాయితీపై విద్యుత్తు అందించాల్సిన అవసరం ఏముంది? అని నిలదీశారు. చిన్న తరహా పరిశ్రమలకు బీసీ, ఎస్సీలకు ఇవ్వని విద్యుత్తు రాయితీ.. బడాబాబులు నడిపే కంపెనీలకు ఇవ్వడం ఎందుకు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు నడిపే పరిశ్రమలకు విద్యుత్తు రాయితీ ఎందుకు ఇవ్వడం లేదని.. ఆ సామాజిక వర్గాలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? అని బాలశౌరి నిలదీశారు.

Updated Date - Feb 15 , 2024 | 10:23 PM

Advertising
Advertising