ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Kesineni: పోలవరానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:50 PM

Andhrapradesh: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్‌స‌భ‌లో రూల్ 377 కింద పొల‌వ‌రం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం త‌గిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ప్రభుత్వం...

MP Kesineni Shivanath

న్యూఢిల్లీ, జూలై 22: ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shinath) కోరారు. సోమవారం లోక్‌స‌భ‌లో రూల్ 377 కింద పొల‌వ‌రం ప్రాజెక్ట్ నిధులపై ఎంపీ కేశినేని మాట్లాడారు. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం త‌గిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ప్రభుత్వం (AP Government) చ‌ర్య‌లు చేపట్టిందన్న విషయాన్ని లోక్‌సభలో తెలియజేశారు.

KTR: నూతన చట్టాలపై మీ వైఖరి చెప్పాల్సిందే.. సర్కార్‌కు కేటీఆర్ లేఖ


పొల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశంలోని ఆరు రాష్ట్రాలకు ప్ర‌యోజ‌నం కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84%, భూ సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయన్నారు. 2019 నాటికి, సివిల్ పనులు 71.93%, భూసేకరణ పునరావాసం ప‌నులు 18.66% పూర్తి అయ్యాయని వివరించారు. పొల‌వ‌రం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, భవిష్యత్తుకు ప్రాణాధారం అని లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్నివెల్లడించారు.

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..


కాగా.. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంపై క్లియర్‌గా మాట్లాడాలని ఎంపీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు.. రాష్ట్రం కోసం పెండింగ్ విషయాలపై ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. మరోవైపు పోలవరంను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి సర్కార్ చూస్తోంది. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి.. పోలవరం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ సోమవారం పోలవరంకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అన్న మాట ప్రకారం.. ఇప్పటికే రెండు మూడు సార్లు పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు.


ఇవి కూడా చదవండి...

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..

Speaker Ayyanna: దొడ్డిదారిన కాదు.. రాచమార్గంలో గవర్నర్‌ను తీసుకొచ్చాం!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 04:56 PM

Advertising
Advertising
<