ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:23 PM

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్‌లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.

Vijayawada MP Kesineni Chinni

విజయవాడ, అక్టోబర్ 9: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో (Kanakadurgamma Temple) దేవీనవరాత్రి ఉత్సవాలు (Devinavaratri Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సరస్వతీ దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో (Home Minister Anitha) కలిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) (Vijayawada MP Kesineni Shivanath) బుధవారం పరిశీలించారు.

Pawan Kalyan: కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షిద్దాం.. ఇదే నా విజ్ఞప్తి


క్యూ లైన్‌లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు. భక్తులు క్యూ లైన్‌లల్లో అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్యూ లైన్‌లోని భక్తులకు వేడి పాలను ఎంపీ అందించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సృజన, ఈ.వో రామారావు, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌లకు ఎంపీ కేశినేని శివనాథ్ పలు సలహాలు, సూచనలు అందించారు.


భవానీ భక్తుల దర్శనంపై...

మూలానక్షత్రం సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు తెలిపారు. రాత్రి 12:50 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయని.. ఇప్పటి వరకూ 54 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. మూడు గంటల్లోనే దర్శనమవుతోందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. వీఐపీ దర్శనాలు లేవని చెప్పినప్పటికీ కొంతమంది ముఖ్యమైన వీఐపీలు వచ్చారని అన్నారు. భవానీ భక్తుల నుంచి దర్శనం కోసం విజ్ఞప్తులు వచ్చాయని.. ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలా లేక టైమ్ స్లాట్ పెట్టాలా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీ తెలిపారు.


సీఎం వచ్చే సమయంలోనూ...

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. సీఎం వచ్చే సమయంలోనూ భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. వచ్చే మూడు రోజులూ సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Pawan Kalyan: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం..


సరస్వతీ దేవి అలంకరణలో...

దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (బుధవారం) సరస్వతి దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట నుంచి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం కల్పించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి మరీ భక్తులు బారులు తీరారు. బాక్సుల విధానంలో రోప్‌ల‌ సాయంతో యాభై మంది చొప్పున భక్తులను క్యూలైన్‌లోకి పోలీసులు పంపుతున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...

Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Pawan Kalyan: కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షిద్దాం.. ఇదే నా విజ్ఞప్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 12:30 PM