Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:03 AM
Andhrapradesh: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
అమరావతి, నవంబర్ 6: ఆస్ట్రేలియా జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeshwari) హాజరయ్యారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో ఎంపీ పలు అంశాలను ప్రస్తావించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్న సానుకూల, ఖచ్చితమైన అంశాలను సవివరంగా వివరించడానికి ఈ సదస్సు ద్వారా మంచి అవకాశం దొరికిందని వెల్లడించారు. 8వ తేదీ వరకు కాన్ఫరెన్స్ చర్చల్లో పాల్గొంటామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
US Election Counting: అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
కాగా.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ)లో పాల్గొనేందుకు కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శనివారం (నవంబర్ 2) బయలుదేరి వెళ్లారు. ఈ కాన్ఫరెన్స్‌లో 50కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.. అలాగే మన దేశం నుంచి ఎంపీ పురందేశ్వరి హాజరయ్యారు. మహిళల సమస్యలు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఆస్ర్టేలియాలో జరిగే ఈ సమావేశాల్లో పాల్గొని తిరిగి నవంబర్ 11న ఎంపీ పురందేశ్వరి తిరిగి స్వదేశానికి రానున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా, బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ పురందేశ్వరిని ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈనెల 2న ఆస్ట్రేలియాకు వెళ్లిన పురంధేశ్వరి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే సమావేశాల్లో పాల్గొని తిరిగి 11న మన దేశానికి చేరుకోనున్నారు.
అలాగే ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా నవంబర్ 3న ఆస్ట్రేలియాకు వెళ్లారు. 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం సిడ్నీ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఎయిర్‌పోర్టులో స్పీకర్‌కు ఘనస్వాగతం పలికారు. అయ్యన్న వెంట కుమారుడు చింతకాయల రాజేశ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్నకుమార్ సూర్యదేవర ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
Ponnam: ఆ వివరాలు అవసరం లేదు.. కుల గణనపై మంత్రి పొన్నం సంచలన ప్రకటన
Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 11:34 AM