ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో కనకదుర్గ

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:30 AM

చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది.

అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussehra Sharannavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుసుందరి దేవి (Sri Lalita Tripusundari Devi) అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితాంబవారు. దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగునాతీతమైన కామేశ్వర స్వరూపం. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలతోముఖంకలిగిన మాతృమూర్తి అమ్మ.


చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీవిద్య స్వరూపిణి సృష్టి, స్థితి, సమ్మార, రూపిణి, కుంకుమతో నిత్యపూజలు చేసే సువాస్నులకు తల్లి మంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది.


కాగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శనివారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. తెల్లవారుజాము నుంచి క్యూలు కాస్తంత పలచగా కనిపించినా, ఉదయం 10 గంటలు దాటాక భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీవీఐపీ దర్శనాలు అరగంటలో పూర్తవుతుంటే, సామాన్య భక్తులకు నాలుగైదు గంటల సమయం పడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తుల రాక మొదలైంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. శనివారం వారే ఎక్కువగా కనిపించారు. అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి దర్శించుకున్నారు. మహామండపంలోని ఆరో అంతస్థులో రెండు విడతలుగా కుంకుమార్చనలు నిర్వహించారు. మొదటి విడతలో 82 మంది, రెండో విడతలో 75 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల ఆలయ చైర్మన్‌ కుటుంబ సభ్యులు, ఈవో మూర్తి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది అమ్మవారికి ఇచ్చే కానుకల సంఖ్య పెరిగింది. కాగా, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖరబాబు ఆలయ ప్రాంగణం మొత్తాన్ని నిత్యం పరిశీలిస్తున్నారు. ఏమైనా లోటుపాట్లు కనిపించినప్పుడు వైర్‌లెస్‌ సెట్‌లో ఆదేశాలు ఇస్తున్నారు.


కాగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తు లకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదేశించారు. ఆదివారం నుంచి 30వేల మంది భక్తులకు పాలు, మజ్జిగ అందిస్తామని, భక్తుల రద్దీ మేరకు లడ్డూలు అందుబాటులో ఉంచుతామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. సామాన్య భక్తులకు సాఫీగా అమ్మవారి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. శనివారం 18 వేల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు. ఈ సందర్బంగా కనకదుర్గా సౌందర్య లహరి పుస్తకాన్ని అయన అవిష్కరించారు.

Updated Date - Oct 06 , 2024 | 08:30 AM