ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prakasam Barrage: క్రేన్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యం.. నది లోపలికి వెళ్లి మరీ

ABN, Publish Date - Sep 11 , 2024 | 11:16 AM

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Prakasam Barrage

అమరావతి, సెప్టెంబర్ 11: ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్స్‌ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విశాఖపట్నం, కాకినాడ నుంచి బోట్ కటింగ్ స్క్రూ డ్రైవర్స్‌‌ను బెకెం సంస్థ పిలిపించింది.

Pawan Kalyan: వరద పరిస్థితిపై కాకినాడ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఫోన్


అలా జరిగుంటే అంతా స్మశానమే...

మరోవైపు బోట్స్ ఢీకొన్న ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) పరిశీలించారు. బోట్ల తొలగింపు ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. అనంతరం ఏబీఎన్‌తో మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కౌంటర్ వెయిట్స్‌ను ఐదు రోజుల్లో మార్చగలిగామని తెలిపారు. వైసీపీ కుట్రను మాత్రం బద్దలు కొట్టడానికి కొంత సమయం పడుతుందన్నారు. భారీ క్రెయిన్స్ తీసుకొచ్చి బోర్డ్స్ తొలగించే ప్రక్రియ చేసామని. కానీ ఫలించలేదని తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి భారీ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే బోట్లకు లింక్ చేశారన్నారు.

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. ఎందుకంటే?



బోట్స్ కనుక సెంటర్ పిల్లర్‌ను ఢీకొని ఉంటే ప్రకాశం బ్యారేజ్‌తో పాటు కింది ప్రాంతం మొత్తం స్మశానంగా మారి ఉండేదన్నారు. విశాఖ, కాకినాడ నుంచి అండర్ వాటర్ డ్రైవర్స్ నిపుణులతో బోట్స్‌ను రెండు ముక్కలుగా చేసి వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కట్ చేసిన బోట్స్‌ను ఎయిర్ బెలూన్ సహాయంతో పైకి తీస్తామన్నారు. మరికొద్దిసేపట్లో ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఒక్కొక్క బోటు సుమారు 30 టన్నుల బరువు ఉండటంతో అవి తొలగించడం కష్ట సాధ్యంగా మారుతోందన్నారు. బోట్లకు ఒక దానికి ఒకటి గొలుసు వేయడంతో కౌంటర్ వెయిట్స్‌ను గుద్దుకుని నీటి లోపలికి రెండు.. నీటిపై భాగంలో రెండు బోట్స్ ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

Read LatestAP NewsAndTelugu news

Updated Date - Sep 11 , 2024 | 11:20 AM

Advertising
Advertising