ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Purandeswari: బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదు.. సేవ కూడా!

ABN, Publish Date - Feb 25 , 2024 | 11:35 AM

విజయవాడ: ప్రవాస భారతీయుడు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

విజయవాడ: ప్రవాస భారతీయుడు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) చైర్మన్ గొలగాని రవికృష్ణ (Ravi Krishna) బీజేపీ (BJP)లో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేసారని, పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా ‌నిర్వహించాలని సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ‌ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురందేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదని.. సేవ కూడా అని అన్నారు.

రవికృష్ణ మాట్లాడుతూ.. పురందేశ్వరి తనపై నమ్మకంతో ఇచ్చిన పనిని బాధ్యతగా నిర్వహిస్తానని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ, ఎన్డీయే సపోర్టర్‌గా చాలా సేవా కార్యక్రమాలు చేశానన్నారు. ఒక కార్యకర్తగా తాను పార్టీలో పని చేస్తానని.. పదవులు కోసం కాకుండా... పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని రవికృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 12:19 PM

Advertising
Advertising