Purandeswari: మహిళా సాధికారితపై మోదీకి ప్రత్యేక శ్రద్ధ..
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:48 PM
విజయవాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి ఆమె బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విజయవాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు (AP BJP Chief) దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆధ్వర్యంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి ఆమె బీజేపీ (BJP) కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆదివారం, విజయవాడ (Vijayawada)లో పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే పార్టీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) అమలు చేస్తున్న పధకాలు ప్రజలకు చేరువవుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం మోదీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
నరేంద్రమోదీ హయాంలో డ్వాక్రా లోన్లను రూ. 20 లక్షలు పెంచారని.. తద్వారా ఒక్కో మహిళకు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు వస్తున్నాయని పురందేశ్వరి తెలిపారు. మహిళా సాధికారితపై ప్రధానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది మోదీ అని..18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే భర్తీ చేశారన్నారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పనిచేయాలని సూచించారు. కండువా వేసుకోవడమే కాదని.. కండువా బాధ్యత కోసం పనిచేయాలని.. అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
Updated Date - Mar 03 , 2024 | 12:50 PM