ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert.. జలదిగ్బంధంలో రాయనపాడు రైల్వే స్టేషన్.. తమిళనాడు, గోదావరి ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:40 AM

ఎన్టీఆర్ జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.,)ను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.


జలదిగ్బంధంలో రాయనపాడు రైల్వే స్టేషన్

ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు రైల్వే స్టేషన్ జలదిగ్భందంలో చిక్కుకుంది. దీంతో చెన్నై నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్‌ను రైల్వే అధికారులు రాయనపాడు వద్ద నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, అంబులెన్సులు, పోలీసులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


కొండపల్లి మండలం..

వర్షాలకు బుడమేరు పొంగిపొర్లుతోంది. దీంతో కొండపల్లి మండలం శాంతినగర్ ఇందిరమ్మ కాలనీని వరదనీరు ముంచెత్తింది. నిన్న(శనివారం) రాత్రి సమయంలో సుమారు 200 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి. శాంతినగర్‌కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయినా అధికారులు మాత్రం జేసీబీల సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుడమేరు వరదనీరు శాంతినగర్ కాలనీలోకి రావడంతో పలు ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం నిండిపోయాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యల కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడి బోటు సహితం గల్లంతైంది. బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. కొండపల్లి, రాయనపాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతో సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కొండపల్లి వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాగులో కొట్టుకుపోయి యువకుడి మృతి

చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం

ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

వరంగల్ జిల్లాలో వర్షాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 01 , 2024 | 11:28 AM

Advertising
Advertising