ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramakrishna: ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మరో దొంగ నాటకం

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:40 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరదీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ(Ramakrishna) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు పూర్తయ్యాక విశాఖపట్నం నుంచి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణమని అన్నారు.

అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరదీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ(Ramakrishna) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు పూర్తయ్యాక విశాఖపట్నం నుంచి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణమని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు.

ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలు భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారని చెప్పారు. కర్నూల్‌లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ కనీసం నోరు మెదపడం లేదన్నారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు కొనసాగుతున్న వాటిపై ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ విశాఖ రాజధాని వ్యాఖ్యలు మరో మారు రాష్ట్ర ప్రజలను మోసగించటమేనని రామకృష్ణ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:00 PM

Advertising
Advertising