ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anna Canteens: అన్నా క్యాంటీన్లపై అధికారులతో రివ్యూ: మంత్రి నారాయణ

ABN, Publish Date - Jun 16 , 2024 | 01:55 PM

అమరావతి: అన్నా క్యాంటీన్లపై అధికారులతో ఆదివారం రివ్యూ చేశామని, గతంలో 203 అన్నకాంటీన్‌లకు అనుమతి ఇచ్చామని, 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు.

అమరావతి: అన్నా క్యాంటీన్లపై (Anna Canteens) అధికారులతో ఆదివారం రివ్యూ (Review) చేశామని, గతంలో 203 అన్నకాంటీన్‌లకు అనుమతి ఇచ్చామని, 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. ఆదివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) వచ్చాక అన్నాక్యాంటీన్‌లు తొలగించిందని, చెన్నై (Chennai ), బెంగళూర్‌లో ( Bangalore) మోడల్ పరిశీలించి అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. 3 అన్న క్యాంటీన్‌లు నెల్లూరులో నిన్న విజిట్ చేశామని చెప్పారు. ఈ రోజు అధికారులతో సమావేశమై వాటిపై చర్చించినట్లు చెప్పారు. అన్న క్యాంటీన్‌లు రిపేర్ చేసి ఎస్టిమేషన్ ఇవ్వమని అధికారులకు చెప్పామన్నారు.


గతంలో అన్న క్యాంటీన్‌లు ఇస్కాన్‌కు ఇచ్చామని, బ్రేక్ ఫాస్ట్‌కు, లంచ్, డిన్నర్‌కు 73 రూపాయలు ఖర్చు అవుతుందని, దీనిలో ఇస్కాన్ వాళ్ళుకు 58 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ఆన్న క్యాంటీన్‌లో రోజు 2 లక్షల 20 వేలమంది తినేవారని, 4 కోట్ల 60 లక్షల 31 వేల 600 ప్లేట్‌లు గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ద్వారా అందించామన్నారు. రద్దీ ఎక్కువగా వుండే మార్కెట్‌లు, పరిశ్రమలు వుండే చోట వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. రూరల్ ఏరియాలో 150 క్యాంటీన్‌లు ఇవ్వాలని కూడా అప్పట్లో ముఖ్యమంత్రి చెప్పారన్నారు. సీఎం 5 సంతకల్లో ఆన్న క్యాంటీన్ ఒకటని మంత్రి తెలిపారు.


ఆన్న క్యాంటీన్‌లు 15 రోజుల్లో ప్రారంభించాలని అధికారులను అడిగానని, అందుకు అధికారులు 21 రోజుల సమయం పడుతుందని చెప్పారని మంత్రి నారాయణ అన్నారు. అన్న క్యాంటీన్లు ఉన్న సచివాలయంలు తిరిగి అన్న క్యాంటీన్‌లకు ఇస్తామన్నారు. సచివాలయాలకు ప్రత్యామ్నాయ భవనాలు చూస్తామన్నారు. ప్రస్తుతానికి 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఇస్కాన్ వాళ్లు కూడా సెంట్రలైజ్ కిచెన్లు చాలా చోట్ల నిలిపేశారని, ఆన్న క్యాంటీన్ కుకింగ్ ఎక్విప్మెంట్‌ను తిరిగి ఇతర రాష్ట్రాల నుంచి తేవడానికి సమయం కావాలన్నారని వారు అడిగారన్నారు. చివరకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఎక్విప్మెంట్ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు. గతంలో రూ. 200 కోట్లు బడ్జెట్ కేటాయించారని, ఒక్కో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అప్పట్లో రూ. 42 లక్షల ఖర్చు అయిందని, అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాక తిరిగి ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్లు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్‌

గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుటలేదు..

జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఫైర్‌

మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం

టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 16 , 2024 | 01:58 PM

Advertising
Advertising