ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:12 PM

Andhrapradesh: సిపాయిల తిరుగుబాటుకు జంతువుల కొవ్వు ఉన్న తూటాల వినియోగమే కారణం అని ఈ సందర్భంగా సీబీఐ మాజీ డైరెక్టర్ గుర్తుచేశారు. 177 ఏళ్ల తరువాత క్రైస్తవుడు అయిన జగన్ మళ్లి సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనను గుర్తు చేశారంటూ వ్యాఖ్యానించారు.

former CBI director Nageshwarrao

అమరావతి, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డూల్లో (Tirumala Laddu) కల్తీ నెయ్యి వివాదంపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు (former CBI director Nageshwarrao) సంచలన ట్వీట్ చేశారు. నాటి బ్రిటిషర్ల పాలన తరహలోనే జగన్ పాలన సాగిందంటూ వ్యాఖ్యలు చేశారు. సిపాయిల తిరుగుబాటుకు జంతువుల కొవ్వు ఉన్న తూటాల వినియోగమే కారణం అని ఈ సందర్భంగా సీబీఐ మాజీ డైరెక్టర్ గుర్తుచేశారు. 177 ఏళ్ల తరువాత క్రైస్తవుడు అయిన జగన్ మళ్లి సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనను గుర్తు చేశారంటూ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ద్వారా జగన్ హిందూవులతో గొడ్డు మాంసం తినిపించారని సంచలన కామెంట్స్ చేశారు.

YS Sharmila: తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్ధమేంటి.. వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక..



ఇంత అపచారం జరిగినా ఒక్కశాతం హిందువులు కూడా స్పందించకపోవడం బాధాకరం అంటూ ఆవేదనతో నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. 177 ఏళ్ల కాలంలో హిందుత్వం ఏ రకంగా దెబ్బతిన్నదో ఈ పరిణామలు చూస్తుంటే తెలుస్తోందన్నారు. ఇంత జరిగినా స్పందిచకపోవడంతో దేశంలో హిందువులు లేరని నామమాత్రపు హిందువులే ఉన్నారని అన్నారు. జగన్ సహా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, ధర్మారెడ్డిలపై 153ఏ, 295ఏ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.


ధర్మారెడ్డి చాలా దుర్మార్గుడు: నారాయణ

తిరుపతి కల్తీ లడ్డూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై ప్రతీఒక్కరూ ఖండిస్తున్న పరిస్థితి. తిరుమల లడ్డూల విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై హిందువులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ కల్తీ లడ్డూ వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా స్పందించారు. టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. ధర్మారెడ్డి అనే వాడు చాలా దుర్మార్గుడని వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ఐడీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. ఆయన టీటీడీ ఈవో అయినా కూడా.. వైసీపీ నేతగా వ్యవహరించారన్నారు.

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..


తిరుమల లడ్డూ వ్యవహారం లక్షల భక్తుల సమస్య అని చెప్పుకొచ్చారు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ చేయాలని.. కల్తీ నిజమా కాదో తేల్చాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీలైనంత త్వరగా విచారణ జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రోజు టీటీడీకి వచ్చి లడ్డూ కొనుగోలు చేస్తారని అన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్‌లో ఉన్న డైరీకి ఇవ్వాలని.. ఊరు, పేర్లు లేని కంపెనీలకు ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

Read LatestAP NewsANdTelugu News

Updated Date - Sep 20 , 2024 | 03:15 PM