ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీలో మద్యం షాపులకు మందకొడిగా టెండర్లు...

ABN, Publish Date - Oct 07 , 2024 | 11:06 AM

Andhrapradesh: ఆరు రోజుల వ్యవధిలో 3396 షాపులకు గానూ కేవలం 8274 టెండర్లే దాఖలయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్న పరిస్థితి.

AP Liquor Shop Tender

అమరావతి, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం (AP Govt) విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో గత ప్రభుత్వ హయాంలోని మద్యం షాపులను రద్దు చేసిన సర్కార్.. కొత్త మద్యం షాపుల కోసం టెండర్లను పిలిచింది. ఈ మేరకు నూతన మద్యం షాపుల కోసం గత వారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీలో మద్యం షాపులకు టెండర్లు మందకొడిగా దాఖలవుతున్నాయి. ఆరు రోజుల వ్యవధిలో 3396 షాపులకు గానూ కేవలం 8274 టెండర్లే దాఖలయ్యాయి.

YS Jagan: పుంగనూరులో జగన్ పర్యటన రద్దు.. కారణం ఇదే


స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్న పరిస్థితి. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడవు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలవగా... అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్‌ను బిడ్డర్లు రివర్స్‌ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు గానూ కేవలం 165 టెండర్లు మాత్రమే బిడ్డర్లు దాఖలు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. తిరుపతి,నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకే బిడ్డర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు యావరేజీన 5-6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలైనట్లు సమాచారం.

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా


కాగా.. అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని ఆయన చెప్పారు. దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. మూడు విధానాల్లో దరఖాస్తుల స్వీకరిస్తామని, జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంఆర్‌పీ కంటే అధిక రేటు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూములకు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు. ప్రీమియర్ షాపులకు ఫీజును రూ.1 కోటిగా నిశాంత్ కుమార్ నిర్ధారించారు. మద్యం షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంటుందని, స్కూల్స్, టెంపుల్స్ ఉన్న చోట వంద మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం షాపులకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. మద్యం షాపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై నూతన మద్యం పాలసీలో నిబంధనలను పొందుపరిచామని, బీసీల పేరుతో షాపులు వేరే వ్యక్తి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని నిశాంత్ కుమార్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..

Viral: ఈ వీధి వ్యాపారి ముందు టెకీలు కూడా దిగదుడుపే! ఇతడి రేంజ్ ఏంటో చూస్తే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 11:10 AM