ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Durgamma Temple: వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దుర్గమ్మ ప్రత్యేక సాంగ్

ABN, Publish Date - Oct 03 , 2024 | 10:34 AM

Andhrapradesh: దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్‌లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు.

Vijayawada Kanakadurgamma

విజయవాడ, అక్టోబర్ 3: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ (Kanakadurgamma Temple) సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు అమ్మవారికి స్నాపనాభిషేకం అనంతరం 9 గంటల నుంచి దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వినాయకుని గుడి వద్ద నుంచి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Minister Konda Surekha: వెనక్కి తగ్గేది లేదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్


ఇబ్బంది లేకుండా దర్శనాలు: ఆనం

ఇదిలా ఉండగా... దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ కోసం ప్రత్యేకంగా సాంగ్‌ను రూపొందించారు. గురువారం ఉదయం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారథి పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగతా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayanareddy) మాట్లాడుతూ.. దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్‌లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 100, 300, 500 రూపాయల క్యూలైన్లు ప్రారంభించారని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీఒక్కరికి అన్నప్రసాదం, అన్ని ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మూల నక్షత్రం రోజు అంటే 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సకుటుంబసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.

Hyderabad: 9.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..


విలువైన ఆభరణాలు

రాష్ట్ర గవర్నర్, ఛీఫ్ జస్టిస్, ప్రధాన కార్యదర్శిలను ఆహ్వానించామని.. నవహారతులు తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దుర్గాఘాట్‌లోనే నవహారతులను ఈరోజు నుంచీ ప్రతీ నిత్యం జరుపుతామన్నారు. ముంబై వజ్రాల కిరీటాన్ని అమ్మవారికి సౌరభ్ గౌర్ ఇస్తారని.. వజ్రాల సూర్య చంద్రులను అమ్మవారికి సీ.ఎం.రాజేష్‌ సమర్పిస్తారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైమవతి, సూర్యకుమారి వజ్రాల బొట్టును అమ్మవారికి ఇస్తున్నారని చెప్పారు. ఇవి ఇప్పటికే దేవాదాయశాఖకు అందాయని... ఇవాళ ఈ ఆభరణాలను అమ్మవారికి సమర్పిస్తారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు. అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాటు చేశారని సమాచార శాఖా మంత్రి పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 12:35 PM