AP News: తొలగించిన భరతమాత విగ్రహం తిరిగి ఏర్పాటు..
ABN, Publish Date - Aug 14 , 2024 | 04:40 PM
Andhrapradesh: గతంలో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగురోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని అప్పటి సీఎం జగన్ తొలగించి వేశారు. భరతమాత సెంటర్‌లో విగ్రహాన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేశారు.
అమరావతి, ఆగస్టు 14: గతంలో మాజీ సీఎం జగన్ (Former CM YS Jagan) ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కోసం తొలగించిన భరతమాత విగ్రహన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు తాడేపల్లి వాసులు. సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగురోడ్లు, మధ్యలో డివైడర్, లాన్, వింటేజ్ లైట్లు, స్లైడింగ్ పార్కు ఏర్పాటు కోసం భరతమాత విగ్రహాన్ని అప్పటి సీఎం జగన్ తొలగించి వేశారు. భరతమాత సెంటర్‌లో విగ్రహన్ని తొలగించడానికి వీలులేదని అప్పట్లో స్థానికులు ఆందోళనలు కూడా చేశారు. అయితే రాత్రికి రాత్రి 12 అడుగుల భరతమాత విగ్రహన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు.
Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?
విగ్రహన్ని భద్రపరిచి రొడ్డు నిర్మాణం తరువాత తిరిగి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. అయితే విగ్రహన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో ఎండకు ఎండి వానకు తడిసి విగ్రహం పాడైపోయింది. ఐదేళ్లు అయినప్పటికీ విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయి కూటమి భారీ విజయం సాధించింది అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సీఎం ఇంటి ముందు రోడ్డును ప్రజల కోసం కూటమి సర్కార్ తెరిచింది. దీంతో పాత విగ్రహన్ని తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రయత్నించారు. అయితే విగ్రహం విరిగి పోవడంతో తాత్కలికంగా మూడడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు.
Dharani Issues: బాబోయ్ ‘ధరణి’.. ఇలాగైతే కష్టమే ఇక..!
రేపు (ఆగస్టు 15) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానికులు చందాలు వేసుకుని మరీ అక్కడ కొత్త విగ్రహన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జంక్షన్‌లో 12 అడుగుల విగ్రహాన్ని స్ధానికులు తయారు చేయించారు. రేపు ఉదయం 11 గంటలకు భరతమాత విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి...
Rajnath Singh: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై రాజ్‌నాథ్ కీలక సమావేశం
Jagan Viral Photo: భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 14 , 2024 | 05:24 PM