Anam: భారతీరెడ్డి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందేమో
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:41 PM
Andhrapradesh: ‘‘ 2019లో చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష హోదాపై నువ్వు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా జగన్.. అసలు నీకు ప్రతిపక్షహోదా ఎందుకు ఇవ్వాలి జగన్.. నీకు ఏం అర్హత ఉంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలకు 8,93,333ఓట్లు 2024 ఎన్నికల్లో వచ్చాయి . 8.93లక్షల మంది ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా’’ అంటూ ఆనం మండిపడ్డారు.
అమరావతి, నవంబర్ 12: జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (TDP Leader Anam Venkataramana reddy) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో 39.37శాతం ఓట్లు వైసీపీ నాయకులకు వచ్చాయని.. 1,32,89,134 మంది వైసీపీకి ఓట్లు వేస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని అడిగారు. 1.32 కోట్ల మంది ఓట్లు వేస్తే, వాళ్ల వాణి వినిపించే బాధ్యత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని నిలదీయాల్సిన, సలహాలు, సూచనలు చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు, జగన్‌కు లేదా అని అడిగారు.
Big Fraud: 200 మందిని బురిడీ కొట్టించిన 19 ఏళ్ల కుర్రాడు.. వీడిది మామూలు స్కెచ్ కాదు
మీరు మగాళ్లు అయితే..
‘‘ 2019లో చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష హోదాపై నువ్వు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా జగన్.. అసలు నీకు ప్రతిపక్షహోదా ఎందుకు ఇవ్వాలి జగన్.. నీకు ఏం అర్హత ఉంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలకు 8,93,333ఓట్లు 2024 ఎన్నికల్లో వచ్చాయి . 8.93లక్షల మంది ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా. అసెంబ్లీకి రాకపోయినా గ్యాస్, కరెంట్, కేబుల్, ఇంటర్నెట్, ల్యాండ్ ఫోన్, మొబైల్, పెట్రోలో, మందులు, ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టిక్కెట్లు, గన్ మ్యాన్, అటెండర్లను వీళ్లకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఉచితంగా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాళ్లయితే మాకు జీతాలు, గన్ మ్యాన్లు, ఇతర సదుపాయాలు ఏమీ వద్దు అని స్పీకర్‌కు లేఖ రాయాలి’’ అంటూ సవాల్ విసిరారు.
జగన్ మానసిక స్థితి బాగోలేదు.. అందుకే
ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు గనుకనే ప్రెస్ మీట్‌లో వింతవింతగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని వెంటనే లండన్‌కు పంపించి, మెంటల్ ఆసుపత్రికి పంపించి, ప్రభుత్వమే ఖర్చుపెట్టి బాగుచేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నాను అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగుపడే వరకు వైఎస్ భారతీరెడ్డిని వైసీపీ శాశ్వత అధ్యక్షురాలిగా నియమించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నానన్నారు. జగన్ అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల గురించి రోడ్డెక్కి కుటుంబం పరువు తీసుకుంటున్నారని తెలిపారు. తనను గత ఐదేళ్లుగా వెన్నంటి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, యువనేత నారా లోకేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా అభిమానులకు ఆనం కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు అవసరాలకు వాడుకుని మనుషులను వదిలేస్తాడని అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సన్నాసులకు తనకు వచ్చిన ఆక్వా డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవిని అంకితం చేస్తున్నాను అంటూ ఆనం వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Varraravinder Reddy: వర్రారవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్డ్‌లో కీలక అంశాలు
Read Latest AP News And Telangana News
Updated Date - Nov 12 , 2024 | 04:53 PM