Devineni Uma: కేశినేని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్
ABN, Publish Date - Jan 10 , 2024 | 09:38 PM
కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న
అమరావతి: కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. నష్టాల నుంచి బయటపడటానికే ఆస్తులు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీకి వాటిని ఆపాదించడం నాని దిగజారుడుతనమేనని అన్నారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి మేమంతా.. పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరించామని తెలిపారు. నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని తెలిపారు. యువగళంకు యువత కదిలివస్తుంటే నానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎంపీ పదవికోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా నానీ? అని నిలదీశారు. నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్రెడ్డి.. ఇప్పుడు సన్మార్గుడిగా నానికి కనిపిస్తున్నాడా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Updated Date - Jan 10 , 2024 | 09:39 PM