ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konakalla: జోగి రమేష్ ఘటనపై టీడీపీ నేత కొనకళ్ల వివరణ..

ABN, Publish Date - Dec 18 , 2024 | 01:05 PM

గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.

కృష్ణాజిల్లా, ( మచిలీపట్నం): వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) తో కలిసి విగ్రహావిష్కరణ (Statue unveiling)లో పాల్గొన్న వివాదంపై టీడీపీ నేత (TDP Leader), ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు (APSRTC Chairman Konakalla Narayana Rao) వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని, పార్టీకి తానెప్పుడు విధేయుడిగానే పని చేస్తానని చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్‌తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాధృచ్చికంగా జరిగిందని చెప్పారు.


గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామన్నారు.

త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదన్నారు. పేర్ని నాని అనే వ్యక్తి మాకు అజాత శత్రువు అని, ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించకతప్పదని అన్నారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దోచుకుతిన్న వ్యక్తి పేర్ని నాని అని, పక్కదారి పట్టించిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుండి బయడపడలేరని కొనకళ్ల నారాయణరావు అన్నారు.


కాగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ లో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీ వర్గాల నేతలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివిరాలతో పూర్తి స్థాయి నివేదిక తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆ రోజు వేదికపై జనసేన జెండాపై గతంలో మూత్రం పోసిన బెజవాడ హర్ష, టీడీపీ శ్రేణులను కేసులతో వేధించిన ఆరేపల్లి రాంబాబు, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవి, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నూజివీడు వైఎస్సార్‌సీపీ నేత ఇంటీలో భేటీ అయ్యారు. జోగి రమేష్‌తో కొనకళ్ళ బ్రదర్స్ భేటీ జరిగిందంటూ పార్టీ వర్గాలకు సమాచారం అందింది. ఈ నివేదికను చూసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరును ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించారు.


లచ్చన్న విగ్రహావిష్కరణలో అంతా వారే..

కాగా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో పెనుతుపాను రేపుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ నాయకులను బూతులు తిట్టి.. కేసులతో వేధించి.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు ఈ కార్యక్రమంలో పెద్ద పీట వేయడమే కాకుండా వారితో కలిసి వేదిక పంచుకోవడం తమ్ముళ్ల ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంపై మరిన్ని విషయాలు సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం మొత్తం జోగి రమేశ్‌ను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నంగానే ఉందంటూ పలువురు టీడీపీ మద్దతుదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో అధికశాతం వైసీపీ నాయకులు కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌తోపాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన ఘటనలో కీలక సూత్రధారి వైసీపీ నేత వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు అనగాని రవి, ఎన్నికలకు ముందు జనసేన జెండాపై మూత్రం పోసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడిన ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకుడు బెజవాడ హర్ష, నూజివీడు మండలంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానంటూ ప్రగల్బాలు పలికి టీడీపీ నాయకులను దొంగ కేసులతో వేధించిన నూజివీడు వైసీపీ నేత ఆరేపల్లి రాంబాబు ఇలా వేదికపై ఉన్నవారంతా కరుడుగట్టిన వైసీపీ నాయకులే కాకుండా ఏదో ఒక సమయంలో టీడీపీపై పరిధిదాటి ప్రవర్తించడం గమనార్హం. పైగా వేదికపై నుంచి జోగి రమేశ్‌ ప్రసంగిస్తూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం టీడీపీ నాయకులను తీవ్ర అసహనానికి గురి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది

శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..

నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం..

గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 18 , 2024 | 01:05 PM