ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన..

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:53 AM

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గురువారం శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు (AP egislative Council Meetings) గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా విశాఖ స్టీల్ ఫ్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ అంశంపై మండలిలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు (YSRCP Leaders) డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి టీజీ భరత్ (TG Bharath) మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అయితే అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సెయిల్‌లో విలీనం చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు చెల్లించకపోవడం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.

అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లాం: పవన్

ఈ క్రమంలో ఛైర్మన్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేయాలని సూచించారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు. గతంలో ఈ అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారని డిప్యూటీ సీఎం అన్నారు.


వైఎస్సార్‌సీపీ ఆందోళన..

దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో ఉన్న సమస్య పరిష్కారం కోసమే భూములు అమ్మాలన్న నిర్ణయమని చెప్పారు. పీఎం మోదీ సభలోనే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వద్దని జగన్ చెప్పారని అన్నారు. దీంతో ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ ఆపే శక్తి తమకు ఉంది కాబట్టే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలేదని బొత్స సమాధానం ఇచ్చారు. ఆనాడు త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే ఈరోజు ప్రైవేటీకరణ ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపైవైఎస్సార్‌సీపీ ఆందోళన చేశారు. ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. జై జగన్’ అంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో ఛైర్మన్ సభను సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.

వైజాగ్‌లో వాయు వాయు కాలుష్యం..

వైజాగ్‌లో వాయు కాలుష్యంపై మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నగరంలో వాయు కాలుష్యం నిర్థిష్ట ప్రమాణాలకు లోబడే ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. వాయి కాలుష్యంపై ఏఎన్‌యును నివేదిక అడిగామన్నారు. వచ్చే ఏడాది నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కేంద్రం రూ. 121 కోట్లు కేటాయిస్తే రూ.19 కోట్లు మాత్రమే కాలుష్య నియంత్రణ కోసం ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ

ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన మహాధర్నా వాయిదా

ఐటీకి మరింత ఊతం: సీఎం చంద్రబాబు

జనంలోకి మనం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 11:53 AM