Yarlagadda: వంశీ.. ఆ రెండూ నా దగ్గరున్నాయ్.. డైలాగ్ చెప్పి మరీ యార్లగడ్డ వార్నింగ్
ABN, Publish Date - Feb 25 , 2024 | 07:33 AM
కృష్టా జిల్లా: వల్లభనేని వంశీ, అతని అనుచరులను టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే సోదరులారా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. దాడులు చేసి రివర్స్ కేసు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు...
కృష్టా జిల్లా: వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), అతని అనుచరులను టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే సోదరులారా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. దాడులు చేసి రివర్స్ కేసు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరిక చేశారు. ‘’అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాద రహితుడు అనుకుంటున్నారేమో... జిల్లా ఎస్పీ పేరును నారా లోకేష్ రెడ్ బుక్కులోకి చేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా’’... అంటూ వ్యాఖ్యానించారు.
నా దగ్గరున్నాయ్..
రాష్ట్రంలో ఏది చేయాలన్నా అంగబలం, ఆర్థిక బలం (డబ్బు) అయితే ఈ రెండు తన దగ్గర ఉన్నాయన్నారు. కొట్టుకోవడమే పరిష్కారమైతే, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడిని ఖండిస్తున్నానన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి, పక్కవారి ఆస్తుల లాక్కొనే దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలోనే ఉందని, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో కూడా లేవని అన్నారు.
పెద్ద కథేం కాదు..
ఆరు సార్లు టీడీపీ కైవసం చేసుకున్న గన్నవరంలో తెలుగుదేశం పార్టీ బీఫామ్ పెట్టుకొని తాను గెలవడం చాలా ఈజీ అని, నాయకులను గెలిపించుకునేది పార్టీ కార్యాలయాలపై దాడి చేసేందుకు కాదని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నారా కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవటం దీనికి అంతం లేదా?.... బూతులు మాట్లాడటమే రాజకీయం అయితే రెండు రోజుల్లో నేర్చుకొని తాను కూడా మాట్లాడగలనన్నారు. రాష్ట్రం అధోగతి పాలయి.. రోడ్లు, ఉపాధి లేక వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలు లేవని.. ఈ పరిస్థితి పోవాలంటే చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్‌కు యార్లగడ్డ వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Feb 25 , 2024 | 08:54 AM